Rajender Nagar: రాజేంద్రనగర్ యువతి ఆత్మహత్య.. స్నేహితులే హంతకులా?
రాజేంద్రనగర్ చింతల్‌మెట్‌లో ఆత్మహత్య చేసుకున్న యువతి కేసులో విచారణ మొదలైంది. ఇందులో భాగంగా నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

Rajender Nagar
Rajender Nagar: రాజేంద్రనగర్ చింతల్‌మెట్‌లో ఆత్మహత్య చేసుకున్న యువతి కేసులో విచారణ మొదలైంది. ఇందులో భాగంగా నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. విజయ నగర్ కాలనికి చెందిన మృతురాలు ఇరాం ఖాన్ అలియాస్ మహేర ఖాన్ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటుంది. కొంతకాలంగా ఇంటి పరిసరాల్లో కనిపించకపోవడం, ఇంటికి తాళం వేసి ఉండటంతో ఎవరూ పట్టించుకోలేదు.
చింతల్‌మెట్‌లోని ఆమె ఉంటున్న ప్లాట్ లో నుంచి జనవరి 7వ తేదీన దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి వచ్చిన పోలీసులకు మృతదేహం కనిపించింది. స్థానికుల సాయంతో అది మహేరా ఖాన్‌దిగా గుర్తించారు.
అదే ఫ్లాట్‌లో స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వెడుకలు జరుపుకున్నప్పటి నుంచి కనిపించలేదని చెప్పడంతో.. వేడుకలకు హాజరైన ఆమె స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. తన ప్రియుడే ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇది కూడా చదవండి : ఫ్యామిలీమ్యాన్ డైరెక్టర్స్‌తో మరో సిరీస్‌కి ఓకే చెప్పిన సమంత