KTR: అవయవ దానానికి నేను సిద్ధంగా ఉన్నా.. అసెంబ్లీలో ప్రకటించిన కేటీఆర్
కేటీఆర్ మాట్లాడుతూ.. అవయవ దానం బిల్లుకు బీఆర్ఎస్ తరపున తాము సంపూర్ణ మద్దతును ఇస్తున్నామని అన్నారు.

KTR
KTR: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చివరిరోజు అవయవదానం బిల్లును స్పీకర్ అనుమతితో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సభలో ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం అవయవదానం కోసం రాష్ట్ర విధానాన్ని రద్దు చేస్తూ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఇకపై కేంద్ర విభాగానికి అనుగుణంగా రాష్ట్రంలో అవయవదానం నిబంధనలు ఉండనున్నాయి. అయితే, ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. అవయవ దానం బిల్లుకు బీఆర్ఎస్ తరపున తాము సంపూర్ణ మద్దతును ఇస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో అవయవ దానానికి అందరినీ ప్రోత్సహించే బాధ్యత ప్రజా ప్రతినిధులుగా అందరిపై ఉంది. నియోజకవర్గాల్లోనూ అవయవదానంపై చైతన్యం తేవాలి. ప్రజలకు అవగాహన కల్పించాలని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా అవయవదానానికి తాను సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ ప్రకటించారు.
సభ్యులు ముందుకు వస్తే అసెంబ్లీలోనే సంతకాలు చేద్దామని, అవయవదానంపై మొదటి సంతకం నేనే చేస్తానని కేటీఆర్ వెల్లడించారు. అవయవదానం గొప్ప మానవీయ చర్య అని, మరింత మందికి జీవితాన్నిస్తుందని పేర్కొన్నారు.