Political Books Trend : ఏపీలో రెడ్ బుక్, తెలంగాణలో పింక్ బుక్, ఇప్పుడు కాషాయ బుక్.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా పొలిటికల్ బుక్స్ ట్రెండ్..
ప్రభుత్వాలు ఉండేది ఐదేళ్లే అన్నారు ఈటల రాజేందర్. తాము కాషాయ బుక్ ను మెయింటేన్ చేస్తున్నామని, తమను ఇబ్బంది పెడుతున్న వారికి కచ్చితంగా తగిన పరిణామాలు ఉంటాయని ఈటల హెచ్చరించారు.

Political Books Trend : బుక్స్.. ఈ పదం వింటే ఒకప్పుడు మనకు టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్, రఫ్ బుక్స్ గుర్తుకు వచ్చేవి. కానీ, గత సాధారణ ఎన్నికల నుంచి న్యూ ట్రెండ్ తెరపైకి వచ్చింది. టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్ తో పాటు కొత్త బుక్స్ కూడా ఎంట్రీ ఇచ్చాయి. ప్రస్తుతం ఎవరి నోట విన్నా.. పొలిటికల్ బుక్స్ మాటే వినిపిస్తోంది.
టీడీపీ నేత నారా లోకేశ్ రెడ్ బుక్ తో ఏపీలో మొదలైన ఈ అపోజిషన్ బుక్ ట్రెండ్.. ఇప్పుడు తెలంగాణలో ఎంట్రీ ఇచ్చింది. పింక్ బుక్ రెడీ చేస్తామని ఇటీవలే కవిత ప్రకటన చేశారు. తాజాగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.. కాషాయ బుక్ ను తెరపైకి తెచ్చారు. తాము కాషాయ బుక్ ను మెయింటేన్ చేస్తున్నామని, తమను ఇబ్బంది పెడుతున్న వారికి కచ్చితంగా తగిన పరిణామాలు ఉంటాయని ఈటల హెచ్చరించారు.
ప్రభుత్వాలు ఉండేది ఐదేళ్లే అన్నారు ఈటల రాజేందర్. అయితే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉండేది 35 ఏళ్లు అని ఈటల చెప్పారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో ఎంతోమంది ఉద్దండులను తాము చూశామన్నారు. ఐఏఎస్ లు బానిసల్లా పని చేయొద్దని, గతంలో అలా పని చేసిన వారు జైలు పాలయ్యారని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని నడిపే నాయకుడికి అనుగుణంగా పనితీరు ఉంటుందని, సీఎంతో పాటు వారి బంధు మిత్రుల ఒత్తిడికి తలొగ్గదని ఆయన సూచించారు.
Also Read : ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేశారా? మీకో అప్‌డేట్..
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లాలో ఈటల పర్యటించారు. మీడియాతో మాట్లాడిన ఈటల.. ఐఏఎస్, ఐపీఎస్ లను ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు. అధికారులు చట్ట ప్రకారం నడుచుకోవాలని సూచించారు. బాసుల ఆదేశాలు పాటించడం కాకుండా నిబంధనలకు లోబడి పని చేయాలన్నారు.
లేదంటే శ్రీలక్ష్మి సహా కొందరు అధికారులకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. మేము కూడా ఆరెంజ్ బుక్ మెయింటేన్ చేస్తున్నామన్నారు. ఆ బుక్‌లో అందరి పేర్లు రాసుకుంటున్నామన్న ఈటల.. సమయం వచ్చినప్పుడు లెక్కలతో సహా బయటపెడతామని వార్నింగ్ ఇచ్చారు ఈటల. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని అన్నారు.
అటు బీఆర్ఎస్ నేత కవిత సైతం పింక్ బుక్ అంటూ కలకలం రేపారు. తమ పార్టీ నేతలను, కార్యకర్తలను వేధిస్తున్నారని వదిలేది లేదన్నారు. తాము అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామని అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులు, సీఎం రేవంత్ రెడ్డి అరాచకాలను పింక్ బుక్ లో నోటు చేస్తున్నామన్నారు కవిత. వచ్చేది తమ ప్రభుత్వమే అన్న కవిత.. చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడిన నేతలు, అధికారులకు బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు కవిత.