Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేశారా? మీకో అప్‌డేట్‌..

ఇసుకను అక్రమంగా రవాణా చేసే వారిని కట్టడి చేయాలని కలెక్టర్లకు అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిపారు.

Indiramma Illu: ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేశారా? మీకో అప్‌డేట్‌..

Updated On : February 19, 2025 / 4:01 PM IST

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ఆ ఇండ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక ఇవ్వాలని ఇప్పటికే తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 24 గంటల పాటు స్లాట్ బుకింగ్ సౌకర్యం కల్పిస్తోంది.

దీనిపై ఇప్పటికే మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ ప్రకటన చేశారు. మరోవైపు, ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 9848094373, 7093914343 నంబర్లను తీసుకొచ్చారు.

ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే ఆయా నంబర్లకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చు. 14 నెలల క్రితం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడింది.

Also Read: భారత క్రికెటర్లకు బీసీసీఐ గుడ్‌న్యూస్‌.. ఛాంపియన్స్ ట్రోఫీ వేళ..

ఈ క్రమంలో ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించిన సర్కార్.. గ్రామ సభల ద్వారా అప్లికేషన్లు తీసుకుని మూడు కేటగిరీలుగా విభజించి మొదటి విడతలో L1 లిస్ట్‌ స్టేటస్ ఉన్న వారికి (భూమి ఉన్న వారికి) ఇళ్లు మంజూరు చేయనుంది.

ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక అందిస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ గతంలోనే ప్రటకించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుకను అందించాలని తెలంగాణ మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయిన లబ్ధిదారులు ఇసుక బుకింగ్ కోసం 24 గంటల పాటు, స్లాట్ బుకింగ్ సదుపాయం కల్పించాలని, ఇసుకను అక్రమంగా రవాణా చేసే వారిని కట్టడి చేయాలని కలెక్టర్లకు అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిపారు. లబ్ధిదారులకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పొచ్చు. అతి త్వరలో తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా ఇసుకను అందించనున్నారు.