Telangana Caste Census Report : 4న అసెంబ్లీ సమావేశం.. కులగణన సర్వే నివేదికను సభలో ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం..
తెలంగాణలో 50 రోజుల పాటు కులగణన సర్వే జరిగింది.

Telangana Caste Census Report : ఈ నెల 4వ తేదీన తెలంగాణ అసెంబ్లీ సమావేశం కానుంది. అదే రోజు కులగణన సర్వే నివేదికను సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఆ రోజు ఉదయం 11 గంటలకు సభ సమావేశం కానుంది. 11 గంటలకు కులగణన సర్వే నివేదికను సభలో ప్రవేశ పెట్టనుంది సర్కార్. అదేరోజు.. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్ లో క్యాబినెట్ సమావేశం కానుంది. క్యాబినెట్ లో ఆమోదం పొందిన కులగణన సర్వేను 11 గంటలకు శాసనసభలో ప్రవేశ పెట్టనున్న రేవంత్ ప్రభుత్వం.
50 రోజుల పాటు కులగణన సర్వే..
అటు కులగణన నివేదిక క్యాబినెట్ సబ్ కమిటీకి అందింది. కులగణన నివేదికను ప్లానింగ్ కమిషన్ అధికారులు సబ్ కమిటీకి అందజేశారు. తెలంగాణలో 50 రోజుల పాటు కులగణన సర్వే జరిగింది. 1,03,889 మంది అధికారులు ఈ సర్వేలో పాల్గొన్నారు. 96.9 శాతం కుటుంబాలను అధికారులు సర్వే చేశారు. 3.1శాతం కుటుంబాలు సర్వేలో పాల్గొనలేదని కమిషన్ తెలిపింది.
ఏడాదిలోనే సర్వే నివేదిక తయారు చేయడం మా చిత్తశుద్ధికి నిదర్శనం..
కులగణన సర్వేలో పాల్గొన్న సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇది సువర్ణక్షరాలతో లిఖించదగిన రోజు అని ఆయన అన్నారు. ఈ సర్వేను అడ్డుకోవడానికి దుష్ప్రచారాలు చేశారని మంత్రి పొన్నం ఆరోపించారు.
Also Read : ఓ మై గాడ్.. ఇతడి జీతం ఎంతో తెలిసి ఏకంగా సీఎం చంద్రబాబే షాకయ్యారుగా.. ఆ తర్వాత ఎంత రచ్చ జరిగిందంటే..
విపక్షాల కుట్రలను ఛేదించి ప్రభుత్వం ఈ సర్వేను పూర్తి చేసిందన్నారు. ఏడాదిలోనే సర్వే నివేదిక తయారు చేయడం మా చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారాయన. తెలంగాణ బలహీనవర్గాల గొంతుగా వారికి అండగా ఉండే కార్యక్రమం తమ ప్రభుత్వం చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.
కులగణన సర్వేకు సంబంధించిన రిపోర్టును ప్రణాళిక సంఘం ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీకి అందించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోనే సబ్ కమిటీ.. ఈ నివేదికపై చర్చించింది. దాదాపు 50 రోజులు పాటు ఈ కులగణన సర్వే జరగ్గా, కోటి 10 లక్షల కుటుంబాలు ఇందులో పాల్గొన్నాయి. ఏయే కులాలకు సంబంధించి ఎంతమంది ఉన్నారు అనేదానిపై ప్రభుత్వం ఈ సర్వేలో ప్రధానంగా దృష్టి సారించింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఎంత ఉండాలి అనే దానిపై ప్రభుత్వం దృష్టి సారించింది.
Also Read : బీజేపీ జిల్లా అధ్యక్షులు వీళ్లేనా? ప్రకటించడమే ఆలస్యం..
55.85 శాతం మంది బీసీలు ఉన్నారని కులగణన సర్వేలో తేలినట్లుగా తెలుస్తోంది. సర్వే నివేదికపై క్యాబినెట్ సబ్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. త్వరలో మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశం కానుంది. అందులో కులగణన సర్వే నివేదికపై చర్చించనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశంలో సర్వేకు సంబంధించిన నివేదికను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు, ఇతర కులాలకు ఎంత మేర శాతం రిజర్వేషన్లు కల్పించాలి అనేదానిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.