గాంధీ భవన్‌లో గొర్రెలతో నిరసనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్..! ఈ నిరసన వెనుక ఎవరున్నారని ఆరా..!?
గాంధీ భవన్‌లోకి గొర్రెల ఘటన వెనక పలువురు నేతలు ఉన్నారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి.

కాంగ్రెస్ అంటేనే డిఫరెంట్ ఓపీనియన్స్. పైకి అంతర్గత ప్రజాస్వామ్యం అని చెప్తుంటారు. తీరా చూస్తే రోడ్డెక్కి రచ్చ చేస్తుంటారు. ఇదంతా కాంగ్రెస్‌లో కామనే అయినా..అధికారంలో ఉన్న పార్టీ కావడంతో ఇప్పుడు గాంధీభవన్‌లో జరుగుతున్న నిరసనలు పొలిటికల్ హాట్ టాపిక్ అవుతున్నాయి. మంత్రి పదవులు, వర్గ విబేధాలు అంటూ నేతలు రచ్చ చేయడంపై పార్టీ పెద్దలు సీరియస్ అవుతున్నా..నేతల తీరు మారడం లేదట.
గాంధీభవన్‌లో ధర్నాలు చేస్తూ మీడియాకు ఎక్కుతూ పార్టీకి రోడ్డుకు ఈడుస్తున్నారని సీఎంతో సహా పార్టీ ముఖ్యులు ఆగ్రహంతో ఉన్నారట. ఇప్పటివరకు జరిగిన గొడవల సంగతి అలా ఉండగానే..గాంధీభవన్‌లో గొర్రెలతో నిరసన తెలిపి కొందరు హల్‌చల్ చేశారు. పార్టీ ఆఫీస్ ఆవరణలోకి ఏకంగా గొర్రెల్ని తోలుకొచ్చి దాదాపు గంటకుపైగా హంగామా చేశారు. తమ సామాజికవర్గం వారికి మంత్రి పదవి ఇవ్వాలని గొర్రెలతో వచ్చి నిరసన తెలిపిన వారి ప్రధానమైన డిమాండ్.
అంతేకాదు గొల్ల కురుమల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వాళ్లు కోరుతున్నారు. అయితే ఏ వర్గం వారైనా తమ సమస్యలు చెప్పుకోవడం, తమ డిమాండ్స్ ఉంటే అధిష్టానం ముందు పెట్టడం వరకు ఓకే కానీ..ఇలా ఏకంగా పార్టీ ఆఫీస్‌లోకి గొర్రెలను తీసుకురావడం రచ్చకు దారి తీసింది. సొంత పార్టీ నేతలే ఇలా గొర్రెలతో వచ్చి నిరసన తెలపడంపై సీఎం రేవంత్ రెడ్డి సహా ముఖ్యనేతలందరూ సీరియస్‌గా ఉన్నట్లు టాక్.
Also Read: ఆ వైసీపీ సీనియర్ నేత అందుకే గుమ్మం దాటట్లేదా?
ఈ మధ్యే మంత్రివర్గ విస్తరణ జరిగినా..ఇంకా కొన్ని సామాజిక వర్గాలు తమకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతున్నాయి. ఇంకో మూడు బెర్తులు ఖాళీగా ఉండటంతో మంత్రి పదవులు ఆశిస్తున్న వారు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు పైరవీలు చేస్తూ వచ్చారు. సేమ్‌టైమ్ మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేల పోరాటంతో ఆ వర్గానికి చెందిన నేతకు మంత్రి పదవి వచ్చిందని..అదే లైన్ ఫాలో అవుతున్నారట మిగతా సామాజికవర్గం నేతలు.
ఇటీవల కార్పొరేషన్ పదవులు, పార్టీ కమిటీలు వేసిన నేపథ్యంలో..అందులో యాదవులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్న ఫీలింగ్‌లో ఉన్నారు ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు. ఈ క్రమంలోనే గొల్ల కురుమలు తమ సామాజికవర్గం వారికి మంత్రివర్గం చోటు కల్పించారని డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే గాంధీభవన్‌లోకి ఏకంగా గొర్రెలను తొలుకొచ్చి నిరసన తెలిపారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్, అధిష్టానం పెద్దల్ని కలిసి మంత్రి పదవి కోరటం, ఇతరత్రా పదవుల్ని ఆశించడంలో తప్పులేదు గానీ, ఇలా సొంత పార్టీ ఆఫీస్ ఆవరణలో ధర్నాలు చేయించడంపై సీఎం రేవంత్ రెడ్డి సహా పార్టీ ముఖ్య నేతలంతా సీరియస్‌గా ఉన్నారట.
ఆ నేతలే ఇలా చేయించి ఉంటారని డౌట్!
ఇది క్రమశిక్షణ రాహిత్యమేగాక..పూర్తి బాధ్యతారాహిత్యమని భావిస్తున్నారట సీఎం రేవంత్‌రెడ్డి. ఆ క్రమంలోనే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గాంధీభవన్‌లో గొల్ల కురుమల ధర్నా వ్యవహారంపై సీరియస్ అయినట్టు సమాచారం. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామంటూ సీఎం హెచ్చరించినట్లు తెలుస్తోంది. గొల్ల కురుమలు ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవడం, తమకు గుర్తింపు ఇవ్వరా అని మాట్లాడటం లాంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సీఎం మాట్లాడినట్లు తెలుస్తోంది.
గాంధీ భవన్‌లోకి గొర్రెల ఘటన వెనక పలువురు నేతలు ఉన్నారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి పదవి ఆశిస్తున్న నేతలే వెనకుండి అలా చేయించి ఉంటారని అనుమానిస్తున్నారట. ఇలా పార్టీని, తనను ఇబ్బంది పెట్టేవిధంగా జరుగుతున్న పరిణామాలపై మాత్రం సీఎం కాస్త సీరియస్‌గానే ఉన్నట్టు సమాచారం. పదవులు ఆశించడం, తమ సామాజిక వర్గానికి న్యాయం జరగాలని కోరుకోవడంలో తప్పులేదు కానీ.. పార్టీ కార్యాలయాల ముందు ధర్నాలు చేయించడమంటే పార్టీని అవమానించినట్టేనని భావిస్తున్నారట.
తాజా హెచ్చరికల ద్వారా అలాంటి వాళ్ల మీద తాను ఓ కన్నేసి ఉంచానన్న సంకేతం ముఖ్యమంత్రి పంపారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇదే అదునుగా గాంధీభవన్‌లోకి గొర్రెలతో నిరసన అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీఆర్ఎస్ ట్రై చేస్తోంది. గొర్ర కురుమలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం లేదని, రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దీంతో ఈ వ్యవహారం కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది.