కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపు.. ప్రస్తుతం రేవంత్ కేబినెట్‌లో ఏ మంత్రి వద్ద ఏఏ శాఖలు ఉన్నాయంటే..?
తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపు జరిగింది.

CM Revanth Reddy
Telangana Govt: తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు కొత్త మంత్రులకు శాఖలు ఖరారయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత మంత్రుల శాఖల్లో ఎలాంటి మార్పులు చేయకుండా.. కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖలను ముగ్గురు నూతన మంత్రులకు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో-131ను విడుదల చేసింది.
శాఖలు ఇవే..
గడ్డం వివేక్ వెంకటస్వామి: గనులు, కార్మిక, ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీస్ శాఖలు.
వాకిటి శ్రీహరి : పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, క్రీడలు, యువజన సర్వీసులు.
అడ్లూరి లక్ష్మణ్ : ఎస్సీ అభివృద్ధి, గిరిజన, మైనారిటీ సంక్షేమం. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్‌జెండర్ల సాధికారత శాఖ.
కొత్త మంత్రులకు ముందు కేబినెట్ లో సీఎం ముఖ్యమంత్రితో కలిపి 12మంది మంత్రులు ఉన్నారు. వారిలో కొందరి శాఖలను మార్పుచేస్తారని ప్రచారం జరిగింది. అయితే, పాత మంత్రుల శాఖల్లో ఎలాంటి మార్పులు చేయకుండా.. కేవలం ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖలను మాత్రమే కొత్త మంత్రులకు కేటాయించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఇంకా ఏడు శాఖలు (ఎడ్యుకేషన్, హోం, జీఏడీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, కమర్షియల్ ట్యాక్స్, లా, పబ్లిక్ ఎంటర్ ఫ్రైజెస్) ఉన్నాయి.
ఏఏ మంత్రి వద్ద ఏ శాఖలు ఉన్నాయంటే..
♦ రేవంత్ రెడ్డి : ముఖ్యమంత్రి, జీఏడీ, హోం, ఎడ్యుకేషన్, వాణిజ్య పన్నులు, లా, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్
♦ మల్లు భట్టి విక్రమార్క : ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖలు.
♦ ఉత్తమ్ కుమార్ రెడ్డి : ఇరిగేషన్, కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్, ఆహార, పౌర సరఫరాలు.
♦ దుద్దిళ్ల శ్రీధర్ బాబు : ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, వాణిజ్యం, శాసన సభ వ్యవహారాలు.
♦ తుమ్మల నాగేశ్వరరావు : వ్యవసాయం, మార్కెటింగ్, సహకారం, చేనేత, టెక్స్‌టైల్స్
♦ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి : రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచారం, పౌరసంబంధాలు.
♦ కొండా సురేఖ : పర్యావరణం, అటవీ, దేవాదాయ శాఖలు.
♦ పొన్నం ప్రభాకర్ : రవాణా, బీసీ సంక్షేమం.
♦ సీతక్క : పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి (గ్రామీణ నీటి సరఫరాతో సహా), స్త్రీ, శిశు సంక్షేమం.
♦ జూపల్లి కృష్ణారావు : ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, పర్యాటకం అండ్ కల్చరల్, పురావస్తు శాఖ.
♦ దామోదర రాజనర్సింహా : ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమం, సైన్స్ అండ్ టెక్నాలజీ.
♦ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి : రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ.
♦ వివేక్ వెంకట స్వామి : కార్మిక, ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీలు. మైనింగ్, జియాలజీ శాఖలు.
♦ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ : ఎస్సీ అభివృద్ధి, గిరిజన, మైనారిటీ సంక్షేమం. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్‌జెండర్ల సాధికారత శాఖ.
♦ వాకిటి శ్రీహరి : పశుసంవర్దక, పాడి అభివృద్ధి, క్రీడలు, యువజన సేవలు