Telangana Job Calendar : తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ వచ్చేస్తోంది.. ఆ రోజే ప్రకటన..!
విశ్వవిద్యాలయాకు కూడా నిధులు కేటాయించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Revanth Reddy
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే ఉస్మానియా విశ్వవిద్యాలయ వేదికగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారని తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడి రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతున్న విషయం తెలిసిందే.
ఈ విజయోత్సవాల ముగింపు సభ ఈ నెల 7న ఓయూలో జరగనుంది. రేవంత్ రెడ్డి సూచన మేరకు ఓయూ వీసీ కుమార్ ఈ సభను ఆర్ట్స్ కళాశాల ఎదురుగా జరపడానికి నిర్ణయించి, అందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓయూలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ..
జాబ్ క్యాలెండర్‌తో పాటు ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీపై ప్రకటన చేసే అవకాశం ఉంది. (Revanth Reddy)
రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలను రేవంత్ రెడ్డి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. తొలివిడతలో ఓయూకు రూ.1,000 వెయ్యి, కాకతీయ విశ్వవిద్యాలయానికి రూ.500 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు చేశారు.
ఈ రెండేగాక మిగతా విశ్వవిద్యాలయాకు కూడా నిధులు కేటాయించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సలహాదారు కె.కేశవ రావు నేతృత్వంలో ఇప్పటికే ఓ కమిటీ ఏర్పాటై హయ్యర్ ఎడ్యుకేషన్, టెక్నికల్, స్కూల్ ఎడ్యుకేషన్‌లో చేపట్టాల్సిన మార్పులు, సంస్కరణలపై అధ్యయనం చేసింది.
కాంగ్రెస్ సర్కారు ప్రకటించే తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పటంలో ఎడ్యుకేషన్‌లో సంస్క రణలపై రూట్‌మ్యాప్‌ను రిలీజ్ చేసే అవకాశం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర విద్యార్థులను తీర్చిదిద్దేందుకు అమలు చేయాల్సిన విధివిధానాలను ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది.
