Revanth Reddy: ఇక పదండి.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు

ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అలాగే, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభలు..

Revanth Reddy: ఇక పదండి.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు

Revanth Reddy

Updated On : December 24, 2023 / 3:40 PM IST

Prajapalana: తెలంగాణ సెక్రటేరియట్‌లో కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించి కీలక సూచనలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు మరింత కష్టపడి పని చేయాలని చెప్పారు.

సెక్రటేరియట్‌లో ఏ నిర్ణయం తీసుకున్నా క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యతలు ప్రజాప్రతినిధులు, కలెక్టర్లవేనని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన పేరుతో గ్రామసభను నిర్వహించాలని, పథకాల లబ్ధిదారుల ఎంపిక చేయాలని ఆదేశించారు. పేదవారి సంక్షేమం కోసం పనిచేయాల్సిన బాధ్యత అధికారులదని అన్నారు.

28 నుంచి ప్రజాపాలన
తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు ప్రజాపాలన నిర్వహిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో సభలు ఉంటాయన్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అలాగే, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభలు నిర్వహిస్తామని వివరించారు.

BRS Sweda Patram : బీఆర్ఎస్ స్వేదపత్రం విడుదల.. పదేళ్ల పాలనపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్