Revanth Reddy: వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల నాకు ఫోన్ చేశారు: రేవంత్ రెడ్డి

కలిసి పోరాటం చేద్దామని షర్మిల అన్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ తప్ప మిగతా ఏ పార్టీలతోనైనా కలిసి పోరాడడానికి అభ్యంతరం లేదని చెప్పారు.

Revanth Reddy: వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల నాకు ఫోన్ చేశారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy (1)

Updated On : April 2, 2023 / 8:58 PM IST

Revanth Reddy: వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తనకు ఫోన్ చేశారని, విద్యార్థుల కోసం కలిసి పోరాడదామని అడిగారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్, బీజేపీలతో కలిసి వేదిక పంచుకోవద్దని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ తప్ప మిగతా ఏ పార్టీలతోనైనా కలిసి పోరాడడానికి కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం లేదని అన్నారు. టీఎస్పీఎస్సీ అంశంలో బీజేపీ తూతూ మంత్రంగా వ్యవహరిస్తోందని చెప్పారు.

బండి సంజయ్ ఏం మాట్లాడుతారో ధర్మపురి అరవింద్ బాగా చెబుతారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. మొన్న తాను గాంధీ భవన్ కి వచ్చే ముందే డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేశారని, తర్వాత ఏమైందో తెలియదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని గద్దర్ ని కోరానని తెలిపారు. రాహుల్ సభలో పాల్గొంటానని గద్దర్ చెప్పారని అన్నారు.

అదానీ ఆస్తులు పెరగాడనికి కారణం ప్రజాధనం లూటీ చేయడమేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. అదానీ దేశాన్ని దోపిడీ చేశారని అన్నారు. రాహుల్ గాంధీ ప్రపంచానికి వాస్తవాలను వివరించారని, నిజాలు మాట్లాడిన తర్వాత అదానీ షేర్లు పడిపోయాయని తెలిపారు. ప్రధాని మోదీకి అదానీ అత్యంత ప్రియమిత్రుడని ఆరోపించారు. అదానీ, మోదీ, అమిత్ షా కలిసి రాహుల్ పై కక్ష కట్టారని తెలిపారు.

రాహుల్ లోక్ సభలో మాట్లాడితే దోపిడీ వ్యవస్థ కుప్పకూలి పోయిందని చెప్పారు. జైలు శిక్ష పడ్డా, పార్లమెంట్ సభ్యత్వం తీసేసినా రాహుల్ పై కక్ష ఆగలేదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై పోరాటాలకు కార్యాచరణ రూపొందించామని తెలిపారు. రాహుల్ కోసం రేపు పోస్ట్ కార్డుల ఉద్యమం చేపడతామని చెప్పారు. 7వ తేదీన కాంగ్రెస్ ఇఫ్తార్ పార్టీ ఉంటుందని, ఏప్రిల్ 8న మంచిర్యాలలో భట్టి సత్యాగ్రహ నిరసన దీక్ష చేస్తారని అన్నారు. ఏప్రిల్ 10 నుంచి 25 వరకు హాథ్ సే హాథ్ జోడో యాత్ర నిర్వహిస్తామని తెలిపారు.

గజ్వేల్ లో లక్ష మందితో నిరుద్యోగుల నిరసన కార్యక్రమం ఉంటుందన్నారు. తమ ఒత్తిడితోనే టీఎస్పీఎస్సీ (TSPSC) అంశంపై ఈడీ కేసు నమోదైందని తెలిపారు. కేటీఆర్ ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ కమిషన్ ని రద్దు చేసి నూతన బోర్డును నియమించాలని చెప్పారు. కొత్త బోర్డు నియామకం తర్వాతే టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహించాలని అన్నారు. టీఎస్పీఎస్సీ అంశంపై సీబీఐపై నమ్మకం లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పారు. ప్రశ్నపత్రాల తీగ లాగితే డొంక ప్రగతి భవన్లో తేలిందని అన్నారు. టీఎస్పీఎస్సీ కమిటీని తెలంగాణ సమాజం నమ్మడం లేదని చెప్పారు.

Koppula Eshwar : బీజేపీ అంటే దళిత వ్యతిరేక పార్టీ-కొప్పుల ఈశ్వర్