Revanth Reddy : ఎంపీ పదవికి రాజీనామా చేసిన సీఎం రేవంత్ రెడ్డి

లోకసభ స్పీకర్ ఓం బిర్లాకు తన రాజీనామా లేఖను సమర్పించారు. రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ వ్యవహారాల మాజీ ఇన్చార్జి మణికం ఠాకూర్ స్పీకర్ ను కలిశారు.

Revanth Reddy : ఎంపీ పదవికి రాజీనామా చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy (1)

Revanth Reddy resigns from MP post : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలి సారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేశారు. లోకసభ స్పీకర్ ఓం బిర్లాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఈ మేరకు శుక్రవారం లోకసభ స్పీకర్ ఓం బిర్లాకు తన రాజీనామా లేఖను సమర్పించారు. రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ వ్యవహారాల మాజీ ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే స్పీకర్ ను కలిశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్‌గిరి స్థానం నుంచి రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేయడంతో ఎంపీ పదవికి రేవంత్ రాజీనామా చేశారు. రేపు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

6 గ్యారంటీల అమలుపై స్పీడ్ పెంచిన రేవంత్ సర్కార్
6 గ్యారంటీల అమలుపై రేవంత్ సర్కార్ స్పీడ్ పెంచింది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారు. 6 గ్యారంటీల అమలుపై గురువారం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రేపు (శనివారం) అసెంబ్లీ వాయిదా తర్వాత అసెంబ్లీ ప్రాంగణం నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీంను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నిమ్స్ కు వెళ్లి ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించనున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పది లక్షలతో ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది.

Also Read: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. వారికి మాత్రమే ఫ్రీ, ఆ బస్సుల్లోనే ఉచితం.. మార్గదర్శకాలు జారీ