Road Accident : నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

నల్గొండ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. చింతపల్లి మండలం వెంకటేశ్వర నగర్‌ వద్ద క్రూయిజర్ వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు

Road Accident : నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

Road Accident

Updated On : November 12, 2021 / 8:09 AM IST

Road Accident : నల్గొండ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా కొల్కులపల్లి వెళ్తుండగా నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వెంకటేశ్వర నగర్‌ వద్ద వారు ప్రయాణిస్తున్న క్రూయిజర్ ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. తొమ్మిది మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

చదవండి : Tirumala Ghat Road: తిరుమలలో విరిగిపడ్డ కొండచరియలు.. ఘాట్ రోడ్ క్లోజ్

మృతదేహాలను పోస్టుమార్టం ప్రభుత్వం దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. డ్రైవర్ నిద్రమత్తు వలన ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాధమికంగా నిర్దారించారు. మృతులు మర్రిగూడ మండలం వట్టిపల్లికి చెందిన రాములు, సత్తయ్యగా గుర్తించారు.

చదవండి : Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి సహా కుమారుడు, కుమార్తె దుర్మరణం