ముఖ్యమంత్రి రేవంత్ నిన్న మరోసారి అబద్ధాలు చెప్పారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకులాలకు ఏం చేసిందో తాను బహిరంగ చర్చకు సిద్ధమని తెలిపారు.

RS Praveen Kumar
సంక్షేమ పాఠశాలల్లో 53 మంది విద్యార్థులు మృతి చెందారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. హైకోర్టు కూడా ప్రభుత్వానికి సూచనలు చేసిందని, తమ పార్టీ తరఫున వేసిన కమిటీ గురుకుల పాఠశాలలపై అధ్యయనం చేసిందని తెలిపారు.
తమ అధ్యయనంతో ప్రభుత్వం పిక్నిక్ ఏర్పాటు చేసినట్లు ఒక రోజు కార్యక్రమం నిర్వహించిందని విమర్శించారు. ముఖ్యమంత్రి నిన్న మరోసారి అబద్ధాలు చెప్పారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకులాలకు ఏం చేసిందో తాను బహిరంగ చర్చకు సిద్ధమని తెలిపారు.
ముఖ్యమంత్రి ఎక్కడికి రమ్మంటే అక్కడికి తాను వస్తానని చెప్పారు. తాము పిల్లల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా మెను సిద్ధం చేశామని తెలిపారు. తాము అమలు చేసిన మెనూను నిన్న రేవంత్ రెడ్డి మరోసారి ప్రకటించారని అన్నారు.
బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ మాట్లాడుతూ.. ఏడాది కాలంగా గురుకులాలను పట్టించుకోని ప్రభుత్వంలో తమ అధ్యయనంతో కదలిక వచ్చిందని అన్నారు. సౌకర్యాల గురించి నేతలు ఆరా తీయలేదని తెలిపారు.
అసెంబ్లీ సమావేశాల్లో తమ పార్టీ నిలదీస్తుందని ప్రభుత్వం పిక్నిక్ ఏర్పాటు చేసుకుందని ఎద్దేవా చేశారు. దళిత, బడుగు వర్గాలు బాగుపడితే రేవంత్ సహించరని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా తమ అధ్యయనాన్ని కొనసాగిస్తామని తెలిపారు. వారానికి ఒక రోజు ప్రభుత్వం హాస్టళ్లపై నిన్నటి మాదిరిగానే దృష్టి పెట్టాలని అన్నారు.
Bhatti Vikramarka: గత బీఆర్ఎస్ సర్కారు వీరిని పట్టించుకోలేదు: భట్టి విక్రమార్క