Sand Door Delivery: తెలంగాణలో ఇసుక డోర్ డెలివరీ.. ఎలా బుక్ చేసుకోవాలి.. ఎప్పటి నుంచి వస్తుంది..?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇసుకను నేరుగా డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ...

Sand Door Delivery
Sand Door Delivery In Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇసుకను నేరుగా డోర్ డెలివరీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేక యాప్ ను రూపొందిస్తుంది. వచ్చే 45 రోజుల్లోపు ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలను జరుగుతున్నాయి. ఈ యాప్ అందుబాటులోకి వస్తే.. ఇంటి అవసరాల కోసం ఎవరైతే ఇసుకను ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటారో వారి ప్రాంతానికే నేరుగా నిర్దేశించిన ఇసుక లారీ లోడ్ వెళ్లనుంది.
Also Read: Ration Card: రేషన్ కార్డు కోసం అప్లయ్ చేశారా..? మీకు బిగ్ అప్డేట్.. 10 రోజుల్లో..
మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ ఇసుక డోర్ డెలివరీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. అవసరం ఉన్న ఎవరైనా సరే ఇతరులపై ఆధారపడకుండా నేరుగా ఇసుకను బుక్ చేసుకునేలా కొత్తగా రూపొందుతున్న యాప్ పనిచేస్తుందని చెప్పారు. ఇందులో ట్రాన్స్ పోర్ట్ వాళ్లను కూడా భాగస్వాములుగా చేయడం జరుగుతుందని, కిలో మీటరుకు ఇంత చొప్పున అని రేటు ఫిక్స్ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఇసుకకు టన్నుకు రూ.405 ఉంది.. ట్రాన్స్ పోర్ట్ చార్జీలు కలిపితే టన్నుకు రూ.1600 లోపే ఉండాలి.. ఇంతకంటే ఎక్కువ ధర ఎవరూ చెల్లించొద్దని శ్రీధర్ సూచించారు. ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లయితే సమాచారం ఇచ్చేందుకు 98480 94373, 70939 14343 ఏర్పాట్లు చేశామని చెప్పారు.
రాష్ట్రంలో ఇసుక పుష్కలంగా ఉంది.. కొరలేదని మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ చెప్పారు. ఎనిమిది లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉంది. అంతేకాక ప్రతీరోజూ 75వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తీస్తున్నాం. అందులో ఇప్పుడు 50వేల క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉంది. అయితే, ఇసుక లోడింగ్ ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఉంటుందని, తెలంగాణ ఆరు జిల్లాల నుంచి హైదరాబాద్ కు ఎక్కువగా ఇసుక వస్తుందని చెప్పారు.
ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు లేవు.. రాబోయే నెలన్నర రోజుల్లో అన్ని చోట్ల సీసీటీవీ, ప్రతీ జీపీఎస్, వేవ్ బ్రిడ్జిలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓవర్ లోడ్ తో ఇసుక తరలిస్తున్న వాళ్లను బ్లాక్ లిస్ట్ లో పెడతామని మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ హెచ్చరించారు.