Mahesh Kumar Goud : ఏదో ఒక రోజు తెలంగాణకు బీసీ సీఎం అవుతారు, ఈ ఐదేళ్లు రేవంతే సీఎం- టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

వచ్చే రోజుల్లో బీసీ సీఎం అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది.

Mahesh Kumar Goud : ఏదో ఒక రోజు తెలంగాణకు బీసీ సీఎం అవుతారు, ఈ ఐదేళ్లు రేవంతే సీఎం- టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

Updated On : February 18, 2025 / 12:15 AM IST

Mahesh Kumar Goud : బీసీ సీఎంపై కీలక వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. తెలంగాణలో ఏదో ఒక రోజు బీసీ సీఎం అవుతారని చెప్పారు. కాంగ్రెస్ నుంచే బీసీ నేత ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఈ ఐదేళ్లు సీఎంగా రేవంత్ రెడ్డే ఉంటారని స్పష్టం చేశారు.

వచ్చే ఎన్నికలన్నీ బీసీల చుట్టే తిరుగుతాయి. గతంలో కాలేదు కాబట్టి, రాహుల్ గాంధీ ఆ స్లోగన్ తీసుకున్నారు కాబట్టి, భవిష్యత్తులో అవకాశం వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అవుతారు. ఈ ఐదేళ్లు మాత్రం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. వచ్చే రోజుల్లో బీసీ సీఎం అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది.

Also Read : ఆ లోపే మంత్రివర్గ విస్తరణ.. మంత్రి ప‌ద‌వులు ఆశిస్తున్న వారు వీరే..

గాంధీభవన్ లో ఓబీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. దీనికి ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు వచ్చారు. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. బీసీ సీఎం అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు మహేశ్ కుమార్ గౌడ్ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో బీసీలు ఎక్కువగా ఉన్నారని, బీసీల వాటాకు సంబంధించి కాంగ్రెస్ తన నినాదానికి కట్టుబడి ఉందన్నారు.

42శాతం రిజర్వేషన్ కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. క్యాబినెట్ విస్తరణలోనూ బీసీలకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. బీసీలకు మంత్రివర్గంలోనే కాదు..ఏకంగా ముఖ్యమంత్రిగా కూడా అవకాశం ఉంటుందని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. అయితే, ఈ ఐదేళ్లు మాత్రం రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారని తేల్చి చెప్పారు. రాబోయే రోజుల్లో ఏదో ఒక రోజు మాత్రం తెలంగాణ రాష్ట్రానికి బీసీ సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయన్నారు.

Also Read : హైదరాబాద్ టు బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ రేట్లపై TGSRTC డిస్కౌంట్

అది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. బీసీల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. బీసీల జనాభా ఎక్కువగా ఉంది. సర్వేలోనూ అదే తేలింది. రాష్ట్రంలో బీసీలు అత్యధికంగా ఉన్నారని, ఆ వర్గం నుంచి ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకు బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కాలేదు. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో బీసీలకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మహేహ్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు.