Special Trains : నాలుగు ప్రత్యేక రైళ్లు నడపనున్న దక్షిణమధ్య రైల్వే

Scrly Operate 4 Special Trains From Today
Special Trains : కరోనా లాక్‌డౌన్ ప్రక్రియలో భాగంగా పలు రాష్ట్రాలు సడలింపులు ఇస్తూ ఉండటంతో ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు ముందస్తుగా రిజర్వేషన్ చేయించుకోవాలి.
సికింద్రాబాద్-షాలిమార్ ఎక్స్‌ప్రెస్(02450) ప్రతి శుక్రవారం అంటే… ఈ నెల 11, 18, 25, జూలై 2న నడుస్తుంది
షాలిమార్-సికింద్రాబాద్ (02449) రైలు ప్రతి బుధవారం అంటే… ఈ నెల 9, 16, 23, 30 తేదీలలో నడుస్తుందని తెలిపింది.
హౌరా-యశ్వంత్‌పూర్ రైలు(02469) ప్రతి గురువారం అంటే… ఈ నెల 10, 17, 24 తేదీల్లోనూ,
యశ్వంత్‌పూర్-హౌరా రైలు (02470) ప్రతి ఆదివారం అంటే… ఈ నెల 13, 20, 27 తేదీల్లో నడుస్తాయని దక్షిణమధ్య రైల్వే తెలిపింది.
ప్రతి గురువారం నడిచే పట్నా-బనాస్‌వాడి రైలు(03253)ను జూన్ 10 నుంచి,
ప్రతి ఆదివారం నడిచే బనాస్‌వాడి-పట్నా రైలు(03254)ను ఈ నెల 13 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు రైల్వే ప్రకటించింది.