Tollywood Drugs Case : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సంచలనం.. కేపీ చౌదరి లిస్టులో సెలబ్రిటీల పేర్లు, ఆ ఇద్దరితో వందల సంఖ్యలో ఫోన్ కాల్స్
Tollywood Drugs Case : తెలుగులో ఐటెమ్ సాంగ్స్ చేసిన మరో హీరోయిన్ పేరు కూడా ఉంది. ఆ ఇద్దరు కేపీ చౌదరికి వందల సంఖ్యలో కాల్స్ చేశారు.

Ashu Reddy In Drugs Case
Tollywood Drugs Case – KP Chaudhary : ప్రముఖ నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కన్య్సూమర్ లిస్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండు రోజుల పాటు జరిగిన పోలీసుల విచారణలో 12మందికి డ్రగ్స్ సప్లయ్ చేసినట్లు కేపీ చౌదరి ఒప్పుకున్నారు. కేపీ చౌదరి లిస్టులో పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నారు.
ఆ లిస్టులో తెలుగు బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డితో పాటు తెలుగులో ఐటెమ్ సాంగ్స్ చేసిన మరో హీరోయిన్ పేరు కూడా ఉంది. ఆ ఇద్దరు కేపీ చౌదరికి వందల సంఖ్యలో కాల్స్ చేశారు. అయితే, ఆ ఫోన్ కాల్స్ పై కేపీ చౌదరి నోరు మెదపడం లేదు. ఇక కేపీ చౌదరి బ్యాంకు లావాదేవీలను పరిశీలించిన పోలీసులు.. అందులో 11 అనుమానాస్పద లావాదేవీలు ఉన్నట్లు గుర్తించారు.
ఈ నెల 14న నిర్మాత కేపీ చౌదరిని డ్రగ్స్ సప్లయ్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. పోలీసులు అతడిని 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంచి, చర్లపల్లి జైలుకి పంపారు. కేపీ చౌదరి కస్టడీ కోరుతూ రంగారెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు రాజేంద్రనగర్ పోలీసులు.