Singareni : సిరులు కురిపిస్తున్న తెలంగాణ కొంగు బంగారం
తెలంగాణ కొంగు బంగారంగా పిలుచుకునే సింగరేణి సంస్థ లాభాల్లో దూసుకుపోతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు (ఏడునెలల) రూ.868 కోట్ల లాభాలు అర్జించి రికార్డు సాధించింది.

Singareni
Singareni తెలంగాణ కొంగు బంగారంగా పిలుచుకునే సింగరేణి సంస్థ లాభాల్లో దూసుకుపోతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు (ఏడునెలల) రూ.868 కోట్ల లాభాలు అర్జించి రికార్డు సాధించింది. ఇదే సమయంలో సంస్థ రూ.14,067 కోట్ల టర్నోవర్ సాధించింది. గతేడాది లాభాలతో పోల్చితే ఈ ఏడాది 177 శాతం. టర్నోవర్ 65 శాతం వృద్ధి నమోదైందని సంస్థ సీఎండీ శ్రీధర్ తెలిపారు. శనివారం మీడియా సమావేశం నిర్వహించిన శ్రీధర్ గత ఏడు నెలల్లో సంస్థ కార్యకలాలపై వివరాలు వెల్లడించారు.
చదవండి : Singareni Collieries : సింగరేణి ఉద్యోగులకు తీపికబురు.. పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంపు
గత ఆర్థిక సంవత్సరం (2020-21) ఏప్రిల్ – అక్టోబర్ మధ్యలో సంస్థ రూ.8,537 కోట్ల అమ్మకాలు జరపగా, ఈ ఏడాది అదే సమయంలో రూ.14,067 కోట్ల అమ్మకాలు జరిపిందని తెలిపారు. కరోనా ప్రభావం బొగ్గు అమ్మకాలు, రవాణాపై పడిందని.. ఇందుమూలంగా గతేడాది సంస్థ రూ.1,129 కోట్ల నష్టాలు వచ్చాయని వివరించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి, రవాణా విద్యుత్తు అమ్మకాలు భారీగా పెరగడంతో రూ.868 కోట్ల లాభాలు వచ్చినట్లు శ్రీధర్ వెల్లడించారు.
చదవండి : Singareni workers : సింగరేణి కార్మికులకు గ్రాట్యూటీ గ్రాంట్ ఎప్పుడో?