High Court Judges: తెలంగాణ హైకోర్టుకు ఆరుగురు కొత్త జడ్జిలు..

రాష్ట్రంలో హైకోర్టులో జడ్జిల సంఖ్య పెరగనుంది. కొత్తగా ఆరుగురు జడ్జిలను నియమించాలని సుప్రిం కొలీజియం సిఫారసు చేసింది.

High Court Judges: తెలంగాణ హైకోర్టుకు ఆరుగురు కొత్త జడ్జిలు..

Suprim Court

Updated On : July 25, 2022 / 8:54 PM IST

High Court Judges: రాష్ట్రంలో హైకోర్టులో జడ్జిల సంఖ్య పెరగనుంది. కొత్తగా ఆరుగురు జడ్జిలను నియమించాలని సుప్రిం కొలీజియం సిఫారసు చేసింది. దీంతో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు ఆరుగురు న్యాయాధికారుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.

TS High court : 10 మంది న్యాయమూర్తులతో ప్రమాణస్వీకారం చేయించిన చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ

హైకోర్టు జడ్జీలుగా కొలీజియం సిఫారసు చేసిన వారిలో ఈవీ వేణుగోపాల్‌, నగేష్‌ భీమపాక, పుల్లా కార్తీక్‌, కాజా శరత్‌, జె.శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వరరావు ఉన్నారు. న్యాయాధికారుల పేర్లను కొలీజియం.. కేంద్రానికి పంపింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన తరువాత ఆ పేర్లు రాష్ట్రపతి ఆమోదం కోసం వెళతాయి. రాష్ట్రపతి ఆమోదం తరువాత వారు న్యాయమూర్తులుగా ప్రమాణం చేస్తారు.

Supreme Cpurt