Hyderabad: 3 నెలల క్రితమే ప్రేమ పెళ్లి.. 8 పేజీల లేఖ రాసి, రైలు కిందపడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
తేజామూర్తి మూడు నెలల క్రితమే ప్రియాంక అనే యువతని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ హైదరాబాద్‌లోనే ఇన్ఫోసిస్‌లో..

Software engineer takes extreme step
Hyderabad – Denduluru: హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్‌లో పనిచేసే తేజామూర్తి అనే సాప్ట్‌వేర్ ఉద్యోగి ఇవాళ ఉదయం ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని ఏలూరు జిల్లా (ELURU DISTRICT) దెందులూరు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
భార్యతో గొడవలు చెలరేగడం, ఈ విషయంలో పోలీసుల వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు తేజామూర్తి లేఖ రాశాడు. అతడి మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
పోలీసుల వేధింపుల వల్లే తేజామూర్తి ఆత్మహత్య చేసుకున్నాడని అతడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భార్యతో ఉన్న గొడవలపై పోలీస్ స్టేషన్‌కి వెళితే అతడికి న్యాయం చేయకపోగా వేధించారని అంటున్నారు. పోలీసుల వేధింపులపై ఉన్నతాధికారులు విచారణ జరపాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
తేజామూర్తి మూడు నెలల క్రితమే ప్రియాంక అనే యువతని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ హైదరాబాద్‌లోనే ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజున పలు కారణాలతో భార్యపై తేజామూర్తి చేయిచేసుకున్నాడు. తనను కొట్టడంతో ఏలూరు వన్ టౌన్ పోలీసుస్టేషన్ లో ప్రియాంక కేసు పెట్టింది.
రాజకీయ నాయకుల ఒత్తిడితో తేజామూర్తిపై పోలీసులు తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. సెటిల్మెంట్‌కు రాకపోతే కేసు పెడతామని, అరెస్టు చేస్తామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. 8 పేజీల సూసైడ్ నోట్ రాసి ఇవాళ తెల్లవారుజామున ఇంటి నుంచి తేజామూర్తి వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు.
Music Director Dasi : ప్రమాదంలో ప్రముఖ సంగీత దర్శకుడు మృతి..