Trains Cancellation: రైల్వే ప్రయాణికులు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులపాటు 28 రైళ్లు రద్దు.. ఆ రైళ్ల వివరాలు ఇవే..
తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాల్లో సోమవారం నుంచి ఆదివారం వరకు వారంరోజుల పాటు 28 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది.

South Central Railway
South Central Railway: తెలుగు రాష్ట్రాలతోసహా పలు రాష్ట్రాల్లో ప్రయాణించే 28 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్యరైల్వే ప్రకటించింది. ఈ మేరకు ట్విటర్ ద్వారా రైళ్ల వివరాలను వెల్లడించింది. ఈ నెల 19వ తేదీ (సోమవారం) నుంచి 25వ తేదీ (ఆదివారం) వరకు 28 రైళ్ల రాకపోకలు నిలిచిపోనున్నాయి. ప్రయాణీకులు రైళ్ల రద్దు విషయాన్ని గమనించి వారంరోజులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ కోరారు. వీటితోపాటు మరో ఆరు రైళ్లను కూడా పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపారు.
South Central Railway: ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో.. 9వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు
అదేవిధంగా హైదరాబాద్ జంట నగరాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే 23 ఎంఎంటీఎస్ రైళ్లనుకూడా సోమవారం నుంచి వచ్చే ఆదివారం వరకు వారంరోజులు రద్దు చేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో ట్రాక్ మరమ్మతులు, ఇతర మౌలిక వసతుల నిర్వహణకు సంబంధించిన పనులు నిర్వహణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
రద్దయిన రైళ్ల వివరాలు ఇవే ..
పాక్షికంగా రద్దయిన రైళ్ల వివరాలు ..

South Central Railway