Southwest Monsoons : తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

రెండు రోజుల్లో తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Southwest Monsoons : తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

Monsoon (1)

Updated On : June 13, 2022 / 3:44 PM IST

Southwest monsoons : తెలంగాణ ప్రజలకు చల్లని కబురు.  ముఖ్యంగా రాష్ట్ర రైతాంగానికి శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. జూన్ 13న తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా వరకు రుతుపవనాలు విస్తరించాయి. రెండు రోజుల్లో తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రాగల 48 గంటల్లో తెలంగాణలోని మరికొన్ని భాగాలకు, తర్వాత రెండు రోజుల్లో రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. సోమవారం క్రింది స్థాయి గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ వైపుకి వీస్తున్నాయి. రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Heavy Rain : ఏపీ, తెలంగాణకు చల్లటి కబురు..మోస్తరు నుంచి భారీ వర్షాలు

మంగళ, బుధవారాల్లోనూ తేలికపాటి నుండి మోస్తరు వనాలు పడనున్నాయి. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.