Journalists Vaccination : 28, 29 తేదీల్లో జర్నలిస్టులకు స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్
రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు స్పెషల్ కొవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ జరుగనుంది. మే 28, మే 29 తేదీల్లో ఈ స్పెషల్ కొవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించనున్నారు.

Special Vaccinaton Drive For Journalists On May 28 May 29
Journalists Special Vaccination Drive : రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు స్పెషల్ కొవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ జరుగనుంది. మే 28, మే 29 తేదీల్లో ఈ స్పెషల్ కొవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు సమాచార, ప్రజాసంబంధాల కమిషనర్ అరవింద్ కుమార్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేయించుకునే జర్నలిస్టులకు వ్యాక్సిన కేంద్రానికి అక్రిడేషన్ కార్డుతో పాటు ఆధార్‌కార్డును తీసుకెళ్లాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని జిల్లాల్లో వ్యాక్సిన్ కేంద్రాల వివరాలు జిల్లా ప్రజా సంబంధాల అధికారి వద్ద అందుబాటులో ఉంటాయన్నారు.
స్టేట్ లెవల్ జర్నలిస్టులకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్, బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్, జూబ్లిహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీ ఇనిస్టిట్యూట్, చార్మినార్ వద్ద యునానీ ఆస్పత్రి, వనస్థలీపురంలో ఏరియా ఆస్పత్రిలో వ్యాక్సినేషన్ అందించనున్నారు.
జర్నలిస్టులందరూ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో పాల్గొనాల్సిందిగా అరవింద్ కుమార్ కోరారు. అయితే రాష్ట్రంలో మొత్తం 20 వేల మంది అక్రిడేటెడ్ జర్నలిస్టులు ఉన్నారు. వీరిలో 3,700 మంది స్టేట్ లెవల్ జర్నలిస్టులు ఉండగా.. వారందరికి కరోనా వ్యాక్సిన్ అందించేలా చర్యలు చేపట్టారు.