వీడు మామూలోడు కాదు, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పోలీసులకు చుక్కలు చూపిస్తున్న కిడ్నాపర్

deekshith kidnap case: మహబూబాబాద్ జిల్లాలో తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్ కిడ్నాప్ కేసులో మిస్టరీ కొనసాగుతోంది. 37 గంటలుగా కిడ్నాపర్ చెరలోనే ఉన్నాడు దీక్షిత్. ఇప్పటివరకు బాలుడి ఆచూకీకి సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దీక్షిత్ కోసం 8 ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు ఎస్పీ కోటిరెడ్డి. మొత్తం 100మంది పోలీసు సిబ్బంది టీమ్ వర్క్ చేస్తోంది. బాలుడి కోసం ఇద్దరు డీఎస్పీలు, 8మంది సీఐలు, 15 మంది ఎస్ఐల నేతృత్వంలో గాలింపు కొనసాగుతోంది.
ఫోన్ కాల్స్ బంద్, బాబాయ్ పైనే అనుమానాలు:
అయితే దీక్షిత్ బాబాయ్ మనోజ్‌పైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న(అక్టోబర్ 19,2020) ఉదయం దీక్షిత్ తల్లికి కాల్ చేసిన కిడ్నాపర్ 45లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఎలాంటి కాల్స్ చేయలేదు. అయితే మనోజ్‌పై అనుమానంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఫోన్స్ కాల్స్ రాకపోవడంతో మనోజే అసలు సూత్రధారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.