Shamshabad Airport: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు ఘనస్వాగతం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తిరుపతి పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు.

Supreme Court Cj Nv Ramana Reached To Shamshabad Airport
Shamshabad Airport: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తిరుపతి పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు. సీజేఐ హోదాలో తొలిసారి హైదరాబాద్‌కు వచ్చిన ఎన్వీ రమణకు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్, టీఆర్ఎస్ సీనియర్ నేత కేకే, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి ఘనస్వాగతం పలికారు.
అనంతరం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అక్కడి నుంచి నేరుగా రాజ్ భవన్ కు బయలుదేరారు. రాజ్ భవన్ వద్ద సీఎం కేసీఆర్ ఎన్వీ రమణకు స్వాగతం పలకనున్నారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తిని కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలుస్తారు. ఇక ఎన్వీ రమణ రాత్రికి రాజ్ భవన్ లోనే బసచేస్తారు.