MLA Rohit Reddy: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి తప్పిన ప్రమాదం..

తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. అతని కాన్వాయ్ వస్తున్న క్రమంలో పశువులు అడ్డురావడంతో వాటిని తప్పించబోయి రోహిత్ వాహనం ప్రమాదానికి గురైంది.

MLA Rohit Reddy: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి తప్పిన ప్రమాదం..

MLA Rohit Reddy

Updated On : June 24, 2023 / 3:24 PM IST

Pilot Rohith Reddy: తాండూరు (Tandur) ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి తృటిలో ప్రమాదం (Accident) తప్పింది. కర్ణాటకలోని శృంగేరి పీఠానికి రోహిత్ రెడ్డి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో అతని కాన్వాయ్‌కు కర్ణాటక (Karnataka)లో ఉడిపి (Udipi) సమీపంలో ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. రోహిత్ కాన్వాయ్ వస్తున్న క్రమంలో రహదారిపై పశువులు అడ్డువచ్చాయి. వాటిని తప్పించే ప్రయత్నంలో రోడ్డుపక్కన ఉన్న చెట్టును అతను ప్రయాణిస్తున్న వాహనం ఢీకొట్టింది. బులెట్ ప్రూఫ్ వెహికిల్ (bulletproof car) కావడంతో ప్రమాదంలో రోహిత్ రెడ్డికి ఎలాంటి గాయాలు కాలేదు.

Drugs Case: కేపి చౌదరి డ్రగ్స్ కేసు.. స్పందించిన ఆషురెడ్డి, సురేఖ వాణి

అయితే, ఈ ప్రమాదంపై రోహిత్ రెడ్డి స్పందించారు. తనకు శనివారం ఉదయం యాక్సిడెంట్ అయినట్టు వస్తున్న వార్తలు నిజమేనని అన్నారు. అయితే, ఆ ప్రమాదంలో తనకు ఎటువంటి గాయాలు కాలేదని చెప్పారు. తాండూరు ప్రజలందరి ప్రేమానురాగాల వలన క్షేమంగానే ఉన్నట్లు చెప్పారు. అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు ఎవరూకూడా ఆందోళన చెందవద్దని రోహిత్ రెడ్డి కోరారు.