BRS MLAs Defeat : సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఉన్న ఆ నలుగురూ ఓటమి

పార్టీ మారేందుకు బీజేపీ తమకు వందల కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందని ఈ నలుగురు నేతలు గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

BRS MLAs Defeat : సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఉన్న ఆ నలుగురూ ఓటమి

Telangana Assembly Election 2023 Result (Photo : Google)

Updated On : December 3, 2023 / 5:12 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలింది. అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. ముఖ్యమైన నాయకులు, పలువురు మంత్రులు ఓటమిపాలయ్యారు. బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన ఓటర్లు కాంగ్రెస్ కు పట్టం కట్టారు.

ఇక, దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఉన్న నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. తాండూర్ నుంచి పోటీ చేసిన పైలట్ రోహిత్ రెడ్డి, కొల్లాపూర్ నుంచి బరిలోకి దిగిన బీరం హర్షవర్దన్ రెడ్డి, పినపాక నుంచి పోటీ చేసిన రేగా కాంతారావు, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఓటమి చవిచూశారు.

Also Read : ప్రగతి భవన్ పేరు మారుస్తాం.. ఘన విజయం అనంతరం రేవంత్ తొలి కామెంట్

పార్టీ మారేందుకు బీజేపీ తమకు వందల కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందని ఈ నలుగురు నేతలు గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నలుగురు ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలనం రేపాయి. తెలంగాణ రాజకీయాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సంపూర్ణ విజయాన్ని నమోదు చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ (60 సీట్లు) ను సాధించింది.

Also Read : బీఆర్ఎస్ కు బిగ్ షాకిచ్చిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓటర్లు.. మళ్లీ అవే ఫలితాలు ..!