BJP Telangana : నవంబర్ 12న ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్

తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలనీ డిమాండ్ చేస్తూ నవంబర్ 12న మిలియన్ మార్చ్ నిర్వహించాలని తెలంగాణ బీజేపీ నిర్ణయించింది.

BJP Telangana : నవంబర్ 12న ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్

Bjp Telangana

Updated On : November 1, 2021 / 5:41 PM IST

BJP Telangana : తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 12న మిలియన్ మార్చ్ నిర్వహించనుంది బీజేపీ. సోమవారం ఆ పార్టీ ముఖ్యనాయకులతో జరిగిన సమావేశంలో అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఈ ప్రకటన చేశారు. ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు సంజయ్ .

చదవండి : BJP, Congress Protest : వీవీ ప్యాట్స్‌ను ప్రైవేటు వాహనంలో తరలింపుపై బీజేపీ, కాంగ్రెస్‌ ఆందోళన

ఇక ఇదే అంశంపై సోమవారం తెలంగాణలోని అన్ని జిల్లాల ముఖ్యనేతలతో మాట్లాడనున్నారు బండి సంజయ్.. మిలియన్ మార్చ్‌‌పై వారికి దిశానిద్దేశం చేయనున్నారు. కాగా నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ పాదయాత్ర సందర్బంగా ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టాడు బండి. దీపావళి లోపు నోటిఫికేషన్ విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే మిలియన్ మార్చ్‌కి పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.

చదవండి : Prashanth Kishore on BJP: బీజేపీకి తిరుగు లేదు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు