Telangana Budget: తెలంగాణ బడ్జెట్లో ఆరు గ్యారంటీలకు కేటాయింపులు ఇలా..
తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టగా..

Telangana Budget 2025-26
Telangana Budget 2025-26: తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టగా.. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా పేర్కొన్నారు. ఈ బడ్జెట్ లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన ఆరు గ్యారంటీలకు పెద్దపీట వేశారు.
ఆరు గ్యారెంటీ పథకాలకు బడ్జెట్ లో మొత్తం రూ.56,084 కోట్లను కేటాయింపులు చేశారు. వీటిలో రైతు భరోసాకు రూ.18వేల కోట్లు, చేయూత పింఛన్లుకు రూ.14,861 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకు రూ.12,571 కోట్లు కేటాయించారు. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంకు రూ. 4,305 కోట్లు, గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం రూ. 2,080 కోట్లు, సన్నరకం వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రస్తుత బడ్జెట్ లో సన్నాలకు బోనస్ కు రూ.1,800 కోట్లు కేటాయించారు.
రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకంకు రూ.1,143 కోట్లు కేటాయించగా.. గ్యాస్ సిలీండర్ రాయితీకి రూ.723 కోట్లు కేటాయించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంకు రూ.600 కోట్లు, విద్యుత్ రాయితీకి రూ. 11,500 కోట్లు, రాజీవ్ యువ వికాసం పథకంకు రూ. 6వేల కోట్లును బడ్జెట్లో కేటాయింపులు చేశారు.