మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి.. వారికి కేటాయించే శాఖలు ఇవే..

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణలో భాగంగా నూతన మంత్రులుగా గడ్డం వివేక్, అడ్డూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలు ప్రమాణ స్వీకారం చేశారు.

మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి.. వారికి కేటాయించే శాఖలు ఇవే..

Updated On : June 8, 2025 / 2:55 PM IST

Telangana cabinet expansion: తెలంగాణ మంత్రి వర్గ విస్తరణలో భాగంగా నూతన మంత్రులుగా గడ్డం వివేక్, అడ్డూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలు ప్రమాణ స్వీకారం చేశారు. రాజభ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ ముగ్గురితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.

మంత్రి వర్గ విస్తరణలో భాగంగా బీసీ, ఎస్సీ వర్గాలకు కాంగ్రెస్ పెద్దపీట వేసింది. బీసీ వర్గం నుంచి ఒకరికి, ఎస్సీ వర్గం నుంచి ఇద్దరికి ఛాన్స్ ఇచ్చింది. వివేక్, లక్ష్మణ్ లను కేబినెట్ లోకి తీసుకోవటం ద్వారా మాల, మాదిగ సామాజిక వర్గాలకు కేబినెట్ లో సముచిత స్థానం కల్పించింది. ప్రస్తుతం రేవంత్ కేబినెట్‌లో సీఎం రేవంత్ తోసహా నలుగురు రెడ్లు, ఇద్దరు బీసీ, ఇద్దరు ఎస్సీ, ఎస్టీ, బ్రాహ్మణ, వెలమ, కమ్మ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ప్రస్తుతం బీసీ మంత్రుల సంఖ్య మూడుకు చేరగా.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మంత్రుల సంఖ్య నాలుగుకు చేరింది.

మంత్రి వర్గ విస్తరణ పూర్తికావడంతో కొత్తగా మంత్రి వర్గంలో చేరిన వారికి ఏఏ శాఖలు దక్కుతాయనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇవాళ సాయంత్రం లేదా రేపు మంత్రులకు శాఖలను కేటాయించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర హోం, మున్సిపల్, విద్య, సంక్షేమ శాఖలు ఉన్నాయి. ఆ శాఖలే కొత్త మంత్రులకు కేటాయించే అవకాశం ఉంది. లేదంటే కేబినెట్ లోని ఇతర మంత్రుల శాఖలను మార్పులు చేర్పులు చేసి కొత్త వారికి ఆ శాఖలు కేటాయిస్తారా అనే అంశంపైకూడా చర్చ జరుగుతుంది.