Telangana: కేసీఆర్ కీలక నిర్ణయం.. 18న తెలంగాణ మంత్రివర్గ సమావేశం
కొత్త సచివాలయంలో తొలిసారి జరగనున్న కేబినెట్ సమావేశం ఇది.

Telangana CM KCR
Cabinet Meeting: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 18న తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు మంత్రివర్గ సమావేశం (Telangana Cabinet) ప్రారంభం అవుతుంది. రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కొన్ని నెలల్లో జరగనుండడంతో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
కొత్త సచివాలయంలో తొలిసారి జరగనున్న కేబినెట్ సమావేశం ఇది. ఇటీవలే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది డిసెంబరులో షెడ్యూలు ప్రకారం ఎన్నికలు జరగాల్సి ఉంది. కర్ణాటక ఎన్నికలు ముగిసిన వెంటనే తెలంగాణ కేబినెట్ సమావేశం అవుతుండడంతో మరింత ప్రాధాన్యం నెలకొంది.
చివరిసారి ఫిబ్రవరి 5న కూడా తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. బడ్జెట్ కు ఆమోదం తెలపడంతో పాటు 4 కొత్త ఆసుపత్రుల నిర్మాణం కోసం రుణానికి కేబినెట్ ఆ రోజున ఆమోదం తెలిపింది. వాటితో పాటు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. కొన్ని నెలలుగా… తెలంగాణ కేబినెట్ సమావేశమైన ప్రతిసారి ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న ప్రచారం జరిగింది. అయితే, ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని ఇప్పటికే పలుసార్లు కేసీఆర్ స్పష్టం చేశారు.
CM KCR : మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ పొలిటికల్ పాఠాలు