CM KCR : సీఎం కేసీఆర్‌కు అస్వస్థత, చికిత్స అందిస్తున్న వైద్యులు

యశోద ఆసుపత్రి వైద్య బృందం పర్యవేక్షణలో సీఎం కేసీఆర్ కు చికిత్స అందుతోంది. CM KCR

CM KCR : సీఎం కేసీఆర్‌కు అస్వస్థత, చికిత్స అందిస్తున్న వైద్యులు

CM KCR Fever

Updated On : September 26, 2023 / 10:58 PM IST

CM KCR Viral Fever : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కేసీఆర్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రగతి భవన్ లోనే కేసీఆర్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. యశోద ఆసుపత్రి వైద్య బృందం పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్ కోలుకుంటారు వైద్యులు తెలిపారు.

Also Read..KTR: చంద్రబాబు అరెస్టుపై స్పందించిన కేటీఆర్.. మాకేం సంబంధం.. హైదరాబాద్ లో ర్యాలీలు ఎందుకు?

‘వారం రోజులుగా కేసీఆర్ వైరల్ ఫీవర్, దగ్గుతో బాధపడుతున్నారు. ఇంట్లోనే ఆయన చికిత్స పొందుతున్నారు. వైద్యుల బృందం సీఎంను నిత్యం పర్యవేక్షిస్తోంది. కొన్ని రోజుల్లో సీఎం కేసీఆర్ కోలుకుంటారని డాక్టర్లు చెప్పారు’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.