Telangana CM : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : 50 వేల ఉద్యోగాల భర్తీ

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అన్ని శాఖల్లో కలిపి 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమోషన్ల వల్ల ఏర్పడిన ఖాళీలను రెండో దశలో భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.

Telangana CM : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : 50 వేల ఉద్యోగాల భర్తీ

Telangana Cm Orders Appointment Of 50k Jobs

Updated On : July 9, 2021 / 6:21 PM IST

Telangana 50k Jobs : తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అన్ని శాఖల్లో కలిపి 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమోషన్ల వల్ల ఏర్పడిన ఖాళీలను రెండో దశలో భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.

Read More : Uniform Civil Code : ఆధునిక భారత్ కి ఉమ్మడి పౌర స్మృతి అవసరం..ఢిల్లీ హైకోర్టు

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో కొలువుల జాతర ప్రారంభం కానుంది. ఉద్యోగాల భర్తీకి ఆటంకాలకు సంబంధించి ఆటంకాలు తొలగిపోయాయి. ఇక ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో నూతన జోన్ల ఏర్పాటు చేస్తూ..రాష్ట్రపతి ఉత్తర్వులు రావడం, ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. దీని ద్వారా స్థానికులకు అవకాశాలు ఎక్కువగా లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

Read More : Death Predictor :ఎప్పుడు చనిపోతామో తెలుసుకోవచ్చట..మరణం గురించి చెప్పే క్యాలుకులేటర్

గతంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక రావడం..ఇతరత్రా కారణాలతో ఉద్యోగాల భర్తీ..ఆగిపోయింది. పోలీసుశాఖలో అత్యధికంగా, ఆ తర్వాత విద్య, వైద్యఆరోగ్య శాఖల్లో అధిక పోస్టులున్నాయని, రెవెన్యూ, పురపాలక, వ్యవసాయ, నీటిపారుదల శాఖల్లోనూ గణనీయంగానే ఉద్యోగ ఖాళీలున్నాయని సమాచారం.