Komatireddy RajGopal Reddy: కాంగ్రెస్ సభ్యులెవరు నాకు మద్దతు ఇవ్వలేదు: రాజగోపాల్ రెడ్డి

సభకు లేటుగా వచ్చారేంటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. నిన్న అసెంబ్లీలో తలసాని వాఖ్యల సమయంలో కాంగ్రెస్ సభ్యులెవరు నాకు మద్దతుగా మాట్లాడలేదని రాజగోపాల్ రెడ్డి చెప్పారు

Komatireddy RajGopal Reddy: కాంగ్రెస్ సభ్యులెవరు నాకు మద్దతు ఇవ్వలేదు: రాజగోపాల్ రెడ్డి

Komatireddy

Updated On : March 15, 2022 / 5:18 PM IST

Komatireddy RajGopal Reddy: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి రాష్ట్ర అధిష్టానంపై తన అసంతృప్తి వెళ్లగక్కారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోమవారం నాడు మంత్రి తలసాని రాజగోపాల్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ప్రాజెక్టులను రీడిజైన్ చేసి ఆంధ్ర కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారంటూ.. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని తీవ్రంగా స్పందించారు. రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టర్ కావడంతోనే టీఆర్ఎస్ పై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ తలసాని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also read:Jagan On Cabinet Expansion : వైసీపీ ప్లీనరీ తర్వాత.. కేబినెట్ విస్తరణ-సీఎం జగన్

అయితే తలసాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలెవరూ స్పందించలేదు. రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా టీ.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పందించలేదు. దీంతో అలకభూనిన రాజగోపాల్ రెడ్డి మంగళవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు. అయితే మధ్యాహ్నం తరువాత అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. సభకు లేటుగా వచ్చారేంటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. నిన్న అసెంబ్లీలో తలసాని వాఖ్యల సమయంలో కాంగ్రెస్ సభ్యులెవరు నాకు మద్దతుగా మాట్లాడలేదని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ..ఉదయం నుంచి సభకు రాలేదని ఆయన అన్నారు.

Also read:RRR: సజ్జనార్ వాడకం మామూలుగా లేదుగా!

అయితే భట్టి విక్రమార్క సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ ఉదయం ఈ అంశంపై ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు.. అందుకే ఇప్పుడు వచ్చా అంటూ రాజగోపాల్ రెడ్డి బదులిచ్చారు. సభ వాయిదా అనంతరం సీఏల్పీలో భట్టి ఎదుట రాజగోపాల్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజు మీడియా ముఖంగా చేసిన ఖండన నిన్న సభలోనే చేస్తే బాగుండేదని రాజగోపాల్ రెడ్డి అనగా.. నేను బలహీన వర్గాలకు చెందిన నేత కదా..అందుకే ఆలస్యంగా స్పందించా అంటూ భట్టి వ్యాఖ్యానించారు. దీనిపై రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ “నిన్ను బలహీన వర్గాల వాడని ఎవరంటారు.. ఆ వ్యాఖ్యలు ఉపసంహరణ చేసుకో” అంటూ స్నేహపూర్వకంగా భట్టితో అన్నారు. అదే సమయంలో కలగజేసుకున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ఈ ఇష్యూను ఇక్కడితో వదిలేయండని కోరారు.

Also read: TPCC Chief Revanth Reddy : రేవంత్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్ల ఢిల్లీ పయనం ?