తెలంగాణ కరోనా బులెటిన్ విడుదల.. కొత్తగా ఎన్ని కేసులంటే

కొవిడ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అధికారులు సూచించారు.

తెలంగాణ కరోనా బులెటిన్ విడుదల.. కొత్తగా ఎన్ని కేసులంటే

Telangana Corona Bulletin (Photo : Google)

Updated On : December 20, 2023 / 11:29 PM IST

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కొత్తగా 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ కూడా హైదరాబాద్ లోనే వెలుగుచూశాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ నుంచి ఒకరు కోలుకున్నారు. నిన్న నలుగురు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం 14 మంది చికిత్స/ఐసోలేషన్ లో ఉన్నారు.

కొవిడ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అధికారులు సూచించారు. మరోవైపు దేశంలో ఇవాళ ఒక్కరోజే 614 కరోనా కేసులు, 3 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్రం వెల్లడించింది.

Also Read : మీ ఆపిల్ ఐఫోన్ పోగొట్టుకున్నారా? రాబోయే ఈ కొత్త అప్‌డేట్‌తో దొంగిలించిన డివైజ్ ఎవరూ అన్‌లాక్ చేయలేరు..!

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించిన సంగతి తెలిసిందే. కోట్లాది మందిపై ప్రభావం చూపింది. ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకుంది. ఆ తర్వాత మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో జనం ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే, కరోనా తగ్గుముఖం పట్టింది ఇక భయం లేదు అని అనుకున్న ప్రతిసారీ కొత్త వేరియంట్లు కలవర పెడుతున్నాయి. చైనాలో వ్యాప్తి చెందుతున్న JN.1 సబ్ వేరియంట్ కేరళలో తొలిసారి బయటపడింది. దీన్ని పిరోలా/BA.2.86 అని కూడా పిలుస్తున్నారు.

JN.1 వేరియంట్ లక్షణాలు..
దగ్గు
తేలికపాటి జ్వరం
గొంతు మంట
ముఖం మీద నొప్పి
కారుతున్న ముక్కు
జీర్ణశయాంతర సమస్యలు
తల నొప్పి
నాసికా మార్గంలో అసౌకర్యం