Congress CPI Alliance : కాంగ్రెస్-సీపీఐ పొత్తు ఖరారు, ఆ ఒక్క సీటు కేటాయింపు.. పొత్తు విషయంలో తగ్గేదే లేదంటున్న సీపీఎం

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కి సానుకూల వాతావరణం ఉంది. కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలి. తెలంగాణలో ప్రజల ఫిర్యాదులు వినే పరిస్థితి లేదు. Congress CPI Alliance

Congress CPI Alliance : కాంగ్రెస్-సీపీఐ పొత్తు ఖరారు, ఆ ఒక్క సీటు కేటాయింపు.. పొత్తు విషయంలో తగ్గేదే లేదంటున్న సీపీఎం

Congress CPI Alliance

Revanth Reddy On Congress CPI Alliance తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఐ మధ్య పొత్తు కుదిరింది. సీపీఐతో రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు ఫలించాయి. పొత్తుకు వారు ఓకే చెప్పారు. పొత్తులో భాగంగా సీపీఐకి కొత్తగూడెం అసెంబ్లీ స్థానం కేటాయించినట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేకాదు సీపీఐకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామన్నారు. కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థిని గెలిచే విధంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

కాంగ్రెస్ తో పొత్తు ఖరారుపై సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. ”రేవంత్ నాకు మంచి మిత్రుడు. రాజకీయ అనివార్యత దృష్టితో కలిసి పని చేయాలని నిర్ణయించాము. సీపీఐ గొంతు అసెంబ్లీలో వినిపించాలనేది మా ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కి సానుకూల వాతావరణం ఉంది. కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలి. బీఆర్ఎస్, బీజేపీ మిత్రులుగా మారారు. తెలంగాణలో ప్రజల ఫిర్యాదులు వినే పరిస్థితి లేదు. ఆర్టీసీలో కార్మిక సంఘాలు లేకుండా చేశారు. మోడీకి తక్కువేమీ కాదు కేసీఆర్. నిర్బంధం ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. సీపీఎంతో కూడా మైత్రి ఉండాలని చర్చిస్తున్నాం.

Also Read : బీజేపీ-జనసేన మధ్య పొత్తు ఖరారు.. పవన్ కల్యాణ్ పార్టీ పోటీ చేయబోయే 8 స్థానాలు ఇవే

ఇక, సీపీఎంతో పొత్తు అంశంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని, సీపీఎంతో కాంగ్రెస్ పొత్తు ఉంటుందని నాకు నమ్మకం ఉందని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. సీపీఎం పార్టీ తన అభ్యర్థులను ప్రకటించినా.. వారి మద్దతు మాత్రం కాంగ్రెస్ కే ఉంటుందని అనుకుంటున్నాం అని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ కు షాక్ ఇచ్చింది సీపీఎం. కాంగ్రెస్ తో పొత్తు లేదని తేల్చి చెప్పింది. సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ..”భట్టి విక్రమార్క, జానారెడ్డి ఫోన్ చేసి పోటీ చేయవద్దు అంటున్నారు. సీపీఎంతో చర్చలు జరిపిన సమయంలో మిర్యాలగూడెం, వైరా సీట్లు ఇస్తామన్నారు. మాట తప్పారు. సీపీఎం అభ్యర్థులు బరిలో నిలుస్తారు. సీపీఐ పోటీ చేసే చోట్ల సీపీఎం మద్దతు ఇస్తుంది. బీఎస్పీ, సీపీఐ ఎంఎల్, ప్రజాపంథా పార్టీల నేతలు సంప్రదిస్తున్నారు. పాలేరులో సీపీఎం గెలుస్తుంది” అని తేల్చి చెప్పారు తమ్మినేని వీరభద్రం.

Also Read : ముందు మీ కథ మీరు చూసుకోండి- సజ్జలకు వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్