తెలంగాణలో జిల్లాల వారిగా పోలింగ్ వివరాలు ఇలా.. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధిక శాతం పోలింగ్ నమోదు

యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 90.03 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత స్థానాల్లో మెదక్‌ జిల్లా 86.69 శాతం, జనగామ జిల్లాలో 85.74 శాతం, నల్గొండ జిల్లాలో

తెలంగాణలో జిల్లాల వారిగా పోలింగ్ వివరాలు ఇలా.. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధిక శాతం పోలింగ్ నమోదు

Telangana Elections 2023

Updated On : December 1, 2023 / 12:54 PM IST

Telangana Polling 2023 Percentage: తెలంగాణలో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ అన్ని జిల్లాల్లోనూ ప్రశాంతంగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. రాత్రి 12 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 70.66 శాతం పోలింగ్‌ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. నగరాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో మొదటి నుంచి పోలింగ్ నమోదు శాతం ఎక్కువగా ఉంది. పట్టణాలు, నగరాల్లో ఓటువేసేందుకు ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపించలేదు. 2018 శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో 73.37 శాతం ఓటింగ్‌ నమోదైంది. అయితే, ఈ దఫా పోలింగ్ శాతం 2018 కంటే తక్కువగానే నమోదయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాలను శుక్రవారం ఈసీ వెల్లడించనుంది.

Also Read : గెలిచిన అభ్యర్ధులను కాపాడుకునేందుకు కర్ణాటక క్యాంప్ రాజకీయాలకు టీ.కాంగ్రెస్ ప్లాన్..

యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 90.03 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత స్థానాల్లో మెదక్‌ జిల్లా 86.69 శాతం, జనగామ జిల్లాలో 85.74 శాతం, నల్గొండ జిల్లాలో 85.49శాతం, సూర్యాపేట జిల్లాలో 84.83శాతం ఓట్లు పోలయ్యాయి. అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో 46.56 శాతం పోలింగ్‌ మాత్రమే నమోదైంది. నియోజకవర్గాల వారీగా చూస్తే మునుగోడులో గరిష్ఠంగా 91.51 శాతం పోలింగ్ నమోదవగా.. అత్యల్పంగా హైదరాబాద్‌లోని యాకుత్‌పురలో 39.69శాతం పోలింగ్‌ నమోదైంది.

 

District wise polling percentage details

District wise polling percentage details