Telangana Government: ఆటో కార్మికులకు బిగ్ అప్డేట్.. సంక్షేమ బోర్డు ఏర్పాటుపై మంత్రుల భేటీ.. ఛార్జీలు పెంపుపై చర్చ
తెలంగాణ(Telangana Government)లోని ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం, వారి సంక్షేమానికి సంస్థాగత పరిష్కారాలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
Telangana government high level meeting on auto drivers welfare board and fare hike
- సచివాలయంలో మంత్రుల కీలక భేటీ
- ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు
- రూ.1.50 లక్షల ఆర్థిక సాయం
Telangana Government: తెలంగాణలోని ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం, వారి సంక్షేమానికి సంస్థాగత పరిష్కారాలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే నేడు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట్ స్వామి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఈ భేటీలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు ఆటో కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులు కూడా పాల్గొని కార్మికుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి నేరుగా తీసుకురానున్నారు.
KTR Injured: కేటీఆర్ ను లాక్కెళ్లిన పోలీసులు.. చేతికి, నుదుటికి గాయాలు
సంక్షేమ బోర్డు, ఛార్జీల పెంపుపై ప్రధాన చర్చ:
ఈ సమావేశంలో ఆటో డ్రైవర్లకు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సంక్షేమ బోర్డు ఏర్పాటు అంశంపై ముఖ్యాంశంగా చర్చించే అవకాశం ఉందని సమాచారం. దీంతో పాటు ప్రస్తుత పెరిగిన నిర్వహణ వ్యయాలు, ఇంధన ధరల దృష్ట్యా మీటర్ ఛార్జీల సవరణ, అగ్రిగేటర్ పాలసీ వల్ల యాప్ ఆధారిత ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఆదాయ భద్రతా సమస్యలపై ప్రతినిధులు(Telangana Government) అధికారులతో సమాలోచనలు జరుపనున్నారు.
రూ. 1.50 లక్షల రీట్రోఫిట్మెంట్ సాయం అమలుపై దృష్టి:
డీజిల్, పెట్రోల్ ఆటోలను పర్యావరణ అనుకూల వాహనాలుగా మార్చుకునేందుకు రూ. 1.50 లక్షల ఆర్థిక సాయం అందించే కేబినెట్ నిర్ణయానికి కార్యాచరణ రూపకల్పన చేయనున్నారు. ఈ సాయాన్ని అర్హులైన డ్రైవర్లకు ఏ విధంగా అందించాలనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలను ఖరారు చేయనున్నారు. ఆటో రంగంపై ఆధారపడిన లక్షలాది మంది కుటుంబాలకు మేలు చేకూర్చేలా ఈ సమావేశం నుండి సానుకూల నిర్ణయాలు రానున్నాయని భావిస్తున్నారు.
