Salaries Hike : జీతాలు పెంపు, వారికి గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
Salaries Hike: జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్ సహా అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీల్లో పని చేస్తున్న కార్మికులకు లబ్ది చేకూరనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,06,474 మంది పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు.

Salaries Hike
Salaries Hike : మే డే రోజున.. తెలంగాణ ప్రభుత్వం.. పారిశుధ్య కార్మికులకు తీపి కబురు చెప్పింది. వారి జీతాలు పెంచింది. రాష్ట్రంలో పారిశుధ్య కార్మికుల వేతనం వెయ్యి రూపాయల చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన వేతనాలు తక్షణమే అమల్లోకి వస్తాయని సీఎం కేసీఆర్ చెప్పారు.
జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్ సహా అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీల్లో పని చేస్తున్న కార్మికులకు లబ్ది చేకూరనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,06,474 మంది పారిశుధ్య కార్మికులు పని చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులందరికీ పెరిగిన వెయ్యి రూపాయల వేతనం అదనంగా నెల నెలా జీతంతో పాటు కలిపి అందుతుంది. ఇక, త్వరలోనే ఆర్టీసీ కార్మికుల జీతాలు కూడా పెంచుతామని సీఎం కేసీఆర్ చెప్పారు.