Salaries Hiked : జీతాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు

రాష్ట్రంలో అంగన్‌వాడీ టీచర్లు, సహాయ సిబ్బంది వేతనాలను ప్రభుత్వం పెంచింది. వారి వేతనాలు 30 శాతం పెంపు చేసింది. ఈ మేరకు మహిళా, శిశుసంక్షేమశాఖ ఉత్తర్వులు

Salaries Hiked : జీతాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు

Salaries Hiked

Updated On : August 18, 2021 / 7:35 PM IST

Salaries Hiked : రాష్ట్రంలో అంగన్‌వాడీ టీచర్లు, సహాయ సిబ్బంది వేతనాలను ప్రభుత్వం పెంచింది. వారి వేతనాలు 30 శాతం పెంపు చేసింది. ఈ మేరకు మహిళా, శిశుసంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా పెంపుతో అంగన్‌వాడీ టీచర్ల వేతనం రూ. 10,500 నుంచి రూ. 13,650కి పెరిగింది. మినీ అంగన్‌వాడీ టీచర్ల వేతనం రూ.6 వేల నుంచి 7వేల 800కు పెరిగింది. అంగన్‌వాడీ కార్యకర్తల వేతనం రూ.6 వేల నుంచి 7వేల 800కు పెరిగింది. అంగన్‌వాడీ టీచర్లకు పెరిగిన వేతనాలు జూలై నుంచి అమలు కానున్నాయి.

గతంలో అంగన్‌వాడీలను వర్కర్లు అంటే సీఎం కేసీఆర్ ఇప్పుడు టీచర్లుగా పిలవాలని చెప్పి మంచి గౌరవం కల్పించారని టీఆర్ఎస్ నేతలు గుర్తు చేశారు. ఎక్కువసార్లు వేతనాలు కూడా పెంచారని చెప్పారు. ఈసారి కూడా మరోసారి అంగన్‌వాడీలకు జీతాలు పెంచారని అన్నారు. అంగన్ వాడీ ఉద్యోగాలు చేస్తున్న వారిలో చాలా మంది ఒంటరి మహిళలు ఉన్నారని, వేతనాలపైనే ఆధారపడి పని చేస్తున్నారని, జీతాలు పడితేనే వారికి ఇల్లు గడుస్తుందని చెప్పారు.