తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి నెలలో రెండు సార్లు కేబినెట్ సమావేశాలు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతీనెలా రెండుసార్లు..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నుంచి నెలలో రెండు సార్లు కేబినెట్ సమావేశాలు

Updated On : June 6, 2025 / 11:32 AM IST

Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతీనెలా రెండుసార్లు కేబినెట్ సమావేశాలు జరగనున్నాయి. 15రోజులకు ఒకసారి మంత్రివర్గ సమావేశాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.

విధానపరమైన నిర్ణయాల విషయంలో ఆలస్యం లేకుండా వేగం పెంచాలని.. అందుకే రెండు మూడు నెలలకోసారి కాకుండా కేబినేట్​ సమావేశాన్ని నెలలో రెండు సార్లు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. తద్వారా క్షేత్రస్థాయిలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై క్రమం తప్పకుండా సమీక్ష జరపాలన్నారు.

మంత్రులతో ఎప్పటికప్పుడు చర్చించేందుకు వీలుగా రెండు వారాలకోసారి మంత్రి వర్గ సమావేశం ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతి నెలలో మొదటి, మూడవ శనివారం రోజున మంత్రివర్గ సమావేశం నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు 17సార్లు క్యాబినెట్ సమావేశాలు జరిగాయి.