కరోనాపై యుద్ధం గెలిచిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ లో కరోనా ని ఎదుర్కోవడంలో రాష్ట్ర సర్కార్ విజయవంతం అవుతోంది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులను రంగంలోకి దింపిన ప్రభుత్వం.. పాజిటివ్ ఉన్న కేసుకు మెరుగైన వైద్య చికిత్సలు అందించి నెగెటివ్ వచ్చేందుకు దోహదపడింది. నిజానికి తెలంగాణలో డైరెక్ట్ పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. విదేశాల నుంచి వచ్చిన పాజిటివ్ కేసుపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది.
కరోనా బాధితుడిని కలిసి, మాట్లాడిన ప్రతి ఒక్కరినీ తీసుకొచ్చి టెస్ట్‌లు చేసి వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేయగలిగింది. మరోవైపు బాధితుడికి మెరుగైన సేవలు అందించి త్వరగా అతగడు కోలుకునేలా అన్ని చర్యలు తీసుకుంది. తెలంగాణలో కరోనా అనుమానితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా ప్రభుత్వం అదిరిపోలేదు. అనుమానితులందరికీ టెస్ట్‌లు నిర్వహించింది. మరికొందరిని ఐసోలేషన్ వార్డులో ఉంచి ధైర్యం చెప్పింది.
రాష్ట్రంలో నోడల్ సెంటర్‌గా ఉన్న గాంధీలో అనుమానితులు ఒక్కసారిగా పెరిగే సరికి అంతా ఆందోళన చెందారు. కానీ ఆరోగ్యశాఖ మాత్రం.. ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులను రంగంలోకి దించింది. ఆయా ఆస్పత్రుల్లోనూ ఐసోలేషన్ వార్డులు, పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంది. ఎక్కడ కరోనా అనుమానితులు ఉన్నా వారందరికీ పరీక్షలు చేయించింది. (కోళ్ల నుంచి గబ్బిలాలకు సోకిన కొత్త వైరస్)
రాష్ట్రంలో కొత్తగా కరోనా కేసులు నమోదు కాకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ…. సూచనలు , సలహాలు ఇస్తూ కట్టడికి చర్యలు తీసుకున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ వారిచ్చే సూచనలు పాటించారు. ఫలితంగా కొత్త కేసులు నమోదు కాలేదు. కరోనా బాధపడిన యువకుడూ కోలుకున్నాడు. దీంతో ప్రస్తుతం తెలంగాణలో ఒక్క కేసు కూడా లేదు. మొత్తానికి కరోనాపై ప్రభుత్వం విజయం సాధించింది.
See Also | సమ్మర్ ప్లానింగ్: హైదరాబాద్‌లో వాటర్ ప్రాబ్లం లేకుండా చేయడమే టార్గెట్