Ration Card: రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన ప్రభుత్వం.. ఉగాది నుంచి..

రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డుపై ఒక్కొక్కరికి ఉగాది పండుగ నుంచి..

Ration Card: రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన ప్రభుత్వం.. ఉగాది నుంచి..

Ration Card Holders

Updated On : February 16, 2025 / 9:34 AM IST

New Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల కొరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అయితే, ఇప్పటికి వరకు పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి కొత్త రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేస్తుంది. కొత్తగా దరఖాస్తు చేసే వారికోసం అవకాశం కల్పిస్తోంది. దీనికోసం మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చని పౌరసరఫరాల శాఖ పేర్కొంది. ప్రస్తుతం రేషన్ కార్డుల్లో చిరునామా మార్పు, కొత్త సభ్యుల పేర్లను నమోదు చేయించుకోవటం, వార్షికాదాయాన్ని చూపించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

Also Read: Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్‌.. ముందు కట్టేది అక్కడే..

గత కొన్నేళ్లుగా రేషన్ కార్డుల్లో మార్పుచేర్పులకు అవకాశం లేకపోవటంతో ప్రస్తుతం కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం మీ సేవా కేంద్రాల వద్ద కార్డుదారులు బారులు తీరుతున్నారు. ఇప్పటి వరకు ఇంట్లో కొత్తగా చేరిన సభ్యుల పేర్లు రేషన్ కార్డుల్లో చేర్చేందుకు అవకాశం లేకపోవటంతో ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. వివాహం చేసుకున్న మహిళల పేర్లను పట్టింటి రేషన్ కార్డుల్లో తొలగించిన అధికారులు.. అత్తారింటి కార్డులో జోడించేందుకు అవకాశం లేకపోయింది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు పౌరసరఫరాల శాఖ ప్రత్యేక సాప్ట్ వేర్ ద్వారా లబ్ధిదారులను గుర్తించే పని చేపట్టింది. కొత్తగా పెళ్లైన మహిళల పేరును, ఇంట్లో పుట్టిన పిల్లల పేర్లను రేషన్ కార్డుల్లో నమోదు చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆధార్ నెంబర్ ఆధారంగా కొత్తగా పేర్ల నమోదుకు దరఖాస్తు చేసుకున్నవారి పేర్లు ఇతర రేషన్ కార్డులో ఉన్నాయా అనే విషయాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే, ఒక్కో కుటుంబంలో ఇద్దరు నుంచి ముగ్గురు సభ్యుల పేర్లు చేర్చాలని దరఖాస్తులు వచ్చినా తొలి దశలో ఒక్కరినే చేర్చినట్లు తెలుస్తోంది.

Also Read: PM SVANidhi Scheme : ఈ చిరు వ్యాపారులకు అదిరే స్కీమ్.. రూ.50వేల వరకు లోన్.. ఎవరు అర్హులు? ఎలా అప్లయ్ చేయాలంటే?

రాష్ట్రంలో మొత్తం 18లక్షల మందికిపైగా పేర్లను రేషన్ కార్డుల్లో చేర్చాలని 12లక్షలకుపైగా కుటుంబాల నుంచి పౌరసరఫరాల శాఖకు దరఖాస్తులు అందాయి. అయితే, అధికారుల పరిశీలన అనంతరం 6.68లక్షల కుటుంబాలు మాత్రమే మార్పులకు అర్హులని ప్రత్యేక సాఫ్ట్ వేర్ తో గుర్తించారు. ఈ నెలాఖరు వరకు 1.30లక్షల లబ్ధిదారుల పేర్లను పాత కార్డుల్లో కొత్తగా నమోదు చేయాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

 

రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డుపై ఒక్కొక్కరికి నెలకు 6కేజీల బియ్యం అందించనున్నారు. అయితే, వారందరికీ సన్న బియ్యం అందజేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం ఎంత మేర అవసరం అవుతాయనే అంశంపై లెక్కలు తేల్చేపనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే, రేషన్ కార్డుదారులకు ఇవ్వాల్సిన సన్న బియ్యంలో ఇప్పటికే 4.59 లక్షల టన్నులను పౌరసరఫరాల శాఖ సిద్ధం చేసింది. పూర్తిస్థాయి వివరాలను సేకరించి.. అందుకు తగినవిధంగా బియ్యాన్ని సిద్ధంచేసి ఉగాది నాటికి అన్ని రేషన్ దుకాణాల్లో తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం సన్నబియ్యం అందజేసేందుకు చర్యలు వేగవంతం చేసింది.