Telangana Govt: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ పోస్టుల్లో డైరెక్టర్ రిక్రూట్మెంట్..

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భూభారతి చట్టం అమల్లోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్దరించాలని నిర్ణయించింది.

Telangana Govt: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ పోస్టుల్లో డైరెక్టర్ రిక్రూట్మెంట్..

Telangana govt

Updated On : April 19, 2025 / 2:23 PM IST

Telangana Govt: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భూభారతి చట్టం అమల్లోకి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్దరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే కొత్తగా గ్రామ పాలన అధికారి (జీపీవో) పోస్టులను మంజూరు చేసింది. మొత్తం 10,954 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Also Read: Telangana Inter results: తెలంగాణలో ఇంటర్ రిజల్ట్స్ ఆరోజే.. అధికారిక ప్రకటన వచ్చేసింది

గత ప్రభుత్వం హయాంలో వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్ఏ, వీఆర్వోలలో అర్హులైన వారిని జీపీవోలుగా తీసుకొని, మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని తొలుత ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 7వేల మంది అర్హత ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం వారికి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి జీపీవోలుగా అపాయింట్ చేయాలని భావించింది. అయితే, కొత్త పోస్టులతో తమ పాత సర్వీస్ కోల్పోతామని కొందరు కోర్టుకెళ్లారు. దీంతోపాటు వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన వారిని తీసుకుంటే కొత్త సమస్య వస్తుందని ఆలోచించిన ప్రభుత్వం.. డైరెక్టర్ రిక్రూట్ మెంట్ తో పాటు పలు సర్దుబాట్లపై 10,954 జీపీవో పోస్టులను భర్తీ చేయాలని కసరత్తు చేస్తోంది.

Also Read: Gold Imports: బాబోయ్.. బంగారాన్ని భారీగా కొంటున్నారు.. మార్చి నెలలో గణాంకాలు చూస్తే షాకవ్వాల్సిందే..

సర్దుబాటైన వీఆర్వోలను, వీఆర్ఏలను తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి..? దానికి బదులు జూనియర్ పంచాయితీ సెక్రటరీలు మాదిరే జీపీవోలను రిక్రూట్ చేసుకుంటే ఎలా ఉంటుంది..? ఇందులో ప్రభుత్వం పరంగా, న్యాయపరంగా ఏమైనా సమస్యలు ఎదురవుతాయా అనే విషయాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం కోరినట్లు తెలుస్తోంది. వారి నుంచి పూర్తి నివేదిక వచ్చిన తరువాత జీపీవో పోస్టులు ఎలా భర్తీ చేయాలనే అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.