కోడ్‌లోనే స్థానిక సంస్థల ఎన్నికలు: కేసిఆర్ కీలక నిర్ణయం

  • Published By: vamsi ,Published On : April 8, 2019 / 01:06 AM IST
కోడ్‌లోనే స్థానిక సంస్థల ఎన్నికలు: కేసిఆర్ కీలక నిర్ణయం

Updated On : April 8, 2019 / 1:06 AM IST

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలోనే స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం ఈసీఐ అనుమతి కోరింది. మార్చి 13, 22వ తేదీల్లో రెండు సార్లు ఈసీఐకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయగా.. ఎన్నికల సంఘం ప్రభుత్వ లేఖకు స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వ విన్నపానికి ఈసీ అంగీకారం తెలిపింది.

అయితే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను మాత్రం లోక్‌సభ ఫలితాలు ప్రకటించేవరకు విడుదల చేయవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈక్రమంలో ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 20వ తేదీ లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే యోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేలా కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఎన్నికల కోడ్ కారణంగా అభివృద్ధి పనులకు, సంక్షేమ పథకాలకు ఆటంకం కలగడంతో స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా మరోసారి ఆటంకం కలగకూడదని కోడ్ ఉన్నప్పుడే ఎన్నికలను పూర్తి చేసుకోవాలని భావిస్తున్నారు.