Cough Syrup : ఆ దగ్గు సిరప్‌తో జాగ్రత్త.. వెంటనే ఆపేయండి.. ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం హెచ్చరికలు జారీ
cough syrup : చిన్నారుల మృతి ఘటన నేపథ్యంలో ఆ దగ్గు మందు వాడొద్దని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరికలు జారీ చేసింది.

cough syrup
Cough Syrup : పిల్లల్లో దగ్గు నివారణకు కోల్డ్రిఫ్ (పారాసిటమల్, ఫినైల్‌ఫ్రైన్ హైడ్రోక్లోరైడ్, క్లోర్‌ఫెనిరమిన్ మలేట్) సిరఫ్‌ను వాడొద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కోల్డ్రిఫ్ దగ్గు మందు తాగి పలువురు చిన్నారులు మరణించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలకు దగ్గు మందు సూచించిన వైద్యుడిన్ని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది.
కోల్డ్రిఫ్ దగ్గు మందును వాడొద్దని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడు, కాంచిపురం జిల్లా సుంగువచతిరంలోని ఓ ఫార్మా కంపెనీలో తయారైన ఎస్ఆర్ 13 బ్యాచ్ నంబర్ కోల్డ్రిఫ్ సిరఫ్‌లో డైఇథిలీన్ గ్లైకాల్ (DEG) అనే విషపూరిత పదార్థాలు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రమత్తమైంది. ఈ మేరకు ఆ దగ్గు మందును వాడొద్దని సూచించింది.
Also Read: Earthquake : వామ్మో.. ఆ ప్రాంతంలో మరోసారి భారీ భూకంపం.. కుప్పకూలిన భవనాలు.. సముద్రం అల్లకల్లోలం..
తెలంగాణలో రిటైర్లు, హోల్ సేలర్లు, ఆస్పత్రుల్లో ఉన్న ఎస్ఆర్ 13 బ్యాచ్ నంబర్ కోల్డ్రిఫ్ సిరప్‌ను ఫ్రీజ్ చేయాలని డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లను ఆదేశించింది. ఇప్పటికే ఎవరైనా ఈ సిరప్‌ను కలిగి ఉంటే వెంటనే డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ టోల్ ఫ్రీ నవంబర్ 1800-599-6969నెంబర్‌కు ఫోన్ చేసిన సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారాలో కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ తాగిన పదిహేను రోజుల్లో 11మంది కిడ్నీ ఫెయిల్ అయ్యి మృతిచెందారు. ఈ నేపథ్యంలో ఆ సిరప్‌ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది. వెంటనే విచారణకు ఆదేశించింది. అయితే, పిల్లలకు దగ్గు మందును సూచించిన డాక్టర్ ప్రవీణ్ సోనీని భోపాల్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ సిరప్‌ను ఉత్పత్తి చేస్తున్న ఫార్మా స్కూటికల్స్‌పై ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఈ కంపెనీ తమిళనాడులోని కాంచీపురంలో ఉంది.
ఈ సిరప్‌లో కిడ్నీలకు హాని కలిగించే విషపూరిత పదార్థాలను వాడినట్లు భావిస్తున్నారు. ఈ ఘటన తరువాతరు తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా కోల్ఢ్రిఫ్ సిరప్ అమ్మకం, వాడకాన్ని నిషేధించింది. మరోవైపు కేరళ ప్రభుత్వం కోల్డ్రిఫ్ దగ్గు సిరఫ్ విక్రయాలను పూర్తిగా నిలిపివేసింది. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ.. కేరళ రాష్ట్రంలో డీసీఏ నిర్వహించిన ప్రాథమిక విచారణలో కోల్డ్రిఫ్ సిరప్ బ్యాచ్ ఎక్కడ విక్రయాలు జరగలేదని తేలిందని అన్నారు. అయితే, ఆ సిరప్ ను పూర్తిగా నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. తాజాగా.. తెలంగాణ ప్రభుత్వం కోల్డ్రీఫ్ సిరప్ వాడొద్దని సూచించింది.