స్మితా సబర్వాల్ సహా భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం.. ఇప్పుడు ఏ అధికారికి ఏ బాధ్యత అంటే?
శశాంక్ గోయల్ - గుడ్ గవర్నెన్స్ వైస్ ఛైర్మన్

Smita Sabharwal
తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.రామకృష్ణారావును నియమిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఐఏఎస్‌లను బదిలీ చేయాలని నిర్ణయించింది.
Also Read: హాఫ్ సెంచరీలతో చెలరేగిన ఆ ఇద్దరు బ్యాటర్లు.. ముంబై ఇండియన్స్ ఘనవిజయం
ఏ అధికారికి ఏ బాధ్యత?
- శశాంక్ గోయల్ – గుడ్ గవర్నెన్స్ వైస్ ఛైర్మన్
- జయేశ్ రంజన్ – ఇండస్ట్రీ, ఇన్వెస్ట్‌మెంట్ సెల్ సీఈవో
- సంజయ్ కుమార్ – పరిశ్రమలు, వాణిజ్యం ప్రత్యేక ముఖ్యకార్యదర్శి
- స్మితా సబర్వాల్ – ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ
- దానకిశోర్ – కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
- టీకే శ్రీదేవి – పట్టణాభివృద్ధి ముఖ్యకార్యదర్శి (హెచ్‌ఎండీఏ వెలుపల)
- ఇలంబర్తి – పట్టణాభివృద్ధి కార్యదర్శి (హెచ్‌ఎండీఏ పరిధి)
- ఆర్వీ కర్ణన్ – జీహెచ్‌ఎంసీ కమిషనర్
- కె. శశాంక – ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్
- ఎస్. హరీశ్ – జెన్‌కో సీఎండీ
- నిఖిల – రాష్ట్రమానవ హక్కుల కమిషన్ సెక్రటరీ, సీఈవో
- సంగితం సత్యనారాయణ – ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్
- ఎస్. వెంకటరావు – దేవాదాయశాఖ డైరెక్టర్, యాదగిరిగుట్ట ఈవో
- పీ. కాత్యాయనీదేవి – సెర్ప్ అదనపు సీఈవో
- ఈవీ నర్సింహారెడ్డి – ఇండస్ట్రీ, ఇన్వెస్టిమెంట్ సెల్ అదనపు సీఈవో
- హేమంత్‌సహదేవ్ రావు – జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్
- ఫణీంద్రారెడ్డి – టీజీఎంఎస్‌ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్
- కధిరవన్ – పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్
- విద్యాసాగర్ – హైదరాబాద్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)
- ఉపేందర్ రెడ్డి – హెచ్‌ఎండీఏ సెక్రటరీ