TS High Court : వరిసాగుపై కలెక్టర్లకు హైకోర్టు ఆదేశాలు

యాసంగి వరిసాగుపై అనుమానాలకు తెరపడింది. వరి విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటామని.. కొందరు అధికారులు వ్యాఖ్యలు చేయడం రైతులను ఆందోళనకు గురిచేసింది.

TS High Court : వరిసాగుపై కలెక్టర్లకు హైకోర్టు ఆదేశాలు

Ts High Court

Updated On : November 2, 2021 / 9:50 PM IST

TS High Court : యాసంగి వరిసాగుపై అనుమానాలకు తెరపడింది. వరి విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటామని.. కొందరు అధికారులు వ్యాఖ్యలు చేయడం రైతులను ఆందోళనకు గురిచేసింది. అధికారుల వ్యాఖ్యల నేపథ్యంలో వరిసాగుపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు కొందరు రైతులు.

చదవండి : High Court : పంచ్ ప్రభాకర్‌ను ఎలా పట్టుకుంటారో చెప్పండి? సీబీఐపై హైకోర్టు సీరియస్

ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది.. వరి విత్తనాలు అమ్మరాదని, దీని విషయంలో కోర్టులు ఉత్తర్వులు ఇచ్చినా కూడా వరి విత్తనాలను విక్రయించరాదని సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌ వ్యాఖ్యలు చేసినట్లు పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

వాదనలు విన్న హైకోర్టు ఇలాంటి చర్యలు వద్దని కలెక్టర్‌కు మౌఖికంగా చెప్పింది. నిషేధిత జాబితాలో వరి లేనప్పుడు కలెక్టర్‌ వ్యాఖ్యలు సరికాదంది. కోర్టు ఉత్తర్వులు ఉన్నా వరి విత్తనాలు అమ్మే షాపుల్ని తెరవనీయబోమని చెప్పడం న్యాయప్రక్రియలో జోక్యం చేసుకోవడమే అవుతుందని అభిప్రాయపడింది.

చదవండి : Allahabad high court: ప్రియురాలి గౌరవాన్ని ప్రియుడే కాపాడాలి!

వరి విత్తనాల అమ్మకాలు, కొనుగోలుపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని కలెక్టర్‌ను ఆదేశించింది. కలెక్టర్‌ వ్యాఖ్యలు కోర్టుధిక్కారం కిందకు వస్తుందో లేదో పరిశీలన నిమిత్తం ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది.