Revanth Reddy: మా లక్ష్యాలు ఇవే: గ్లోబల్‌ సమిట్‌లో రేవంత్‌ రెడ్డి

పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తల నుంచి ఆలోచనలు, అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నామని అన్నారు.

Revanth Reddy: మా లక్ష్యాలు ఇవే: గ్లోబల్‌ సమిట్‌లో రేవంత్‌ రెడ్డి

Revanth Reddy

Updated On : December 8, 2025 / 5:02 PM IST

Revanth Reddy: దేశంలో కీలకమైన ఆర్థిక నగరం తెలంగాణ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘తెలంగాణ రైజింగ్‌’ పేరిట రాష్ట్ర సర్కారు నిర్వహిస్తున్న గ్లోబల్‌ సమిట్‌ కొనసాగుతోంది. ఈ సదస్సులో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కొత్త రాష్ట్రం తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని చెప్పారు.

“మాకు మహాత్మా గాంధీ, అంబేద్కర్ స్ఫూర్తి. 2047కు సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు వెళ్తున్నాం. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్నదే మా లక్ష్యం. పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తల నుంచి ఆలోచనలు, అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నాం. కేంద్ర సర్కారు కూడా 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని లక్ష్యంగా పెట్టుకుంది” అని అన్నారు.

Also Read: ఈ విషయంలో అన్ని రాష్ట్రాలకంటే ముందున్నాం: గ్లోబల్‌ సమిట్‌లో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

అంతర్జాతీయ కంపెనీలకు డెస్టినేషన్ హబ్‌గా ఇండియా మారిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సెల్‌ఫోన్ల ఉత్పత్తిలో ఇండియా ఇప్పుడు రెండోస్థానంలో ఉందని తెలిపారు. 10 ఏళ్ల వ్యవధిలో దేశంలో విదేశీ పెట్టుబడులు భారీగా పెరిగినట్లు చెప్పారు. కేంద్ర సర్కారు పారదర్శకత, జవాబుదారీతనం వల్ల ఇది సాధ్యమైందని వివరించారు.