Telangana : ఎర్రబెల్లికి తప్పిన ప్రమాదం, కారు ధ్వంసం

తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన కాన్వాయ్ కు మరోసారి ప్రమాదం జరిగింది. మంత్రి వెళుతున్న వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఎర్రబెల్లికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Telangana : ఎర్రబెల్లికి తప్పిన ప్రమాదం, కారు ధ్వంసం

Dayakar

Updated On : August 6, 2021 / 6:00 PM IST

Minister Errabelli Dayakar : తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన కాన్వాయ్ కు మరోసారి ప్రమాదం జరిగింది. మంత్రి వెళుతున్న వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఎర్రబెల్లికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మండలంలో ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు జరుగుతోంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఎర్రబెల్లి శుక్రవారం తొర్రూరుకు వచ్చారు.

అవగాహన సదస్సు అనంతరం ఆయన కొడకండ్ల మండలానికి వెళుతున్నారు. వెలిశాల – కొడకండ్ల మధ్యలో ఆయన కాన్వాయ్ వెళుతుండగా..అదే సమయంలో ఓ ట్రాక్టర్ వెళుతోంది. అకస్మాత్తుగా…ట్రాక్టర్ ఫోర్ వీల్స్ విరిగిపోయి..మంత్రి వాహనానికి తగిలాయి. దీంతో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం నుంచి మంత్రి ఎర్రబెల్లి సురక్షితంగా బయటపడ్డారు. ఎర్రబెల్లికి ప్రమాదం జరిగిందని విషయం తెలుసుకున్న వారు కంగారు పడిపోయారు. ఆయన క్షేమసమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.